BJP victory: బీజేపీ తాజా విజయాన్ని స్టాక్ మార్కెట్లు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. వాస్తవానికి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద కోలాహలం నేడు మార్కెట్లలో ర్యాలీకి కారణంగా నిలిచింది. దీనిపై ప్రముఖ సంస్థలు తమ నివేదికలను అందిస్తున్నాయి.
హిందీ హార్ట్‌ల్యాండ్‌లో జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ స్వీప్ కారణంగా రానున్న కాలంలో బ్యాంకింగ్, పవర్, ఇండస్ట్రీస్, ప్రాపర్టీ, మిడ్ క్యాప్ రంగాల్లోని కంపెనీలు అధికంగా పెరుగుతాయని గ్లోబల్ బ్రోకరేజ్ జెఫరీస్ అభిప్రాయపడింది. తాజా రాజకీయ పరిణామాలతో కేంద్రంలోని ప్రస్తుత పాలన కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, అసోం, త్రిపుర, మణిపూర్‌లతో సహా బీజేపీ డబుల్ ఇంజిన్ లీగ్‌లో తాజాగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వచ్చి చేరాయి.

ఎగ్జిట్ పోల్స్ సూచించిన దానికంటే మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం మెరుగ్గా ఉంది. ఈ ఫలితం 2024 జాతీయ పోల్‌లో మోడీ గెలుపుపై ఏకాభిప్రాయ అంచనాలను బలపరుస్తుందని జెఫరీస్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదే క్రమంలో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటీ ప్రజాదరణ కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్లు బ్రోకరేజ్ పేర్కొంది.
ఎన్నికలకు కొన్ని నెలల ముందర బీజేపీ వ్యూహాత్మకంగా LPG సిలిండర్ ధరల్లో కోత, ఉచిత ఆహార ధాన్యాల కార్యక్రమాన్ని ఐదేళ్ల పాటు పొడిగించడం, విశ్వకర్మ యోజన కింద రుణాలు వంటివి ప్రకటించినప్పటికీ మే నెల దగ్గరపడే సమయానికి మరిన్ని ప్రజాకర్షక ప్రకటనలు ఉంటాయని BofA సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణలు లేదా సబ్సిడీల ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాలని బ్రోకరేజ్ CLSA ఆశిస్తోంది.
డిసెంబర్‌లోనే నిఫ్టీ శుభసూచకమైన 21,000 మార్కును తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సాధారణ ఎన్నికలకు ముందు మార్కెట్లు మరో 1,000-2,000 పాయింట్ల ర్యాలీని నమోదు చేయెుచ్చని నిపుణులు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications