Gold Price: గుడ్ న్యూస్.. తులం బంగారం ధర రూ.1,34,000 తగ్గనుందా..!
ఆగస్ట్ లో భారీగా పెరిగిన బంగారం ధర సెప్టెంబర్ లో కాస్త తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ లో కూడా పసిడి కాస్త తగ్గింది. గత వారం ఔన్సు బంగారం 4,130 డాలర్ల వద్ద ముగిసింది. అయితే పసిడి ఈ ఏడాది జనవరిలో ఔన్సు కు 5,595 డాలర్లకు చేరి రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 26 శాతం తగ్గింది. మన దేశంలో పసిడి గరిష్ట స్థాయి నుంచి సుమార్ 23 శాతం క్షీణించింది. అయితే ఆగస్ట్ పుత్తడి ధర భారీగా పెరిగింది. తులం బంగారం ధర రూ.1,64,773కు చేరింది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. గత వారం 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,990కి తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు 4,130 డాలర్లకు చేరింది. పసిడి ధర భారీగా పెరిగిన సమయంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి ధరల ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత అమెరికా-ఇరాన్ యుద్ధం ముదరడంతో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరింది. ఇది కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. అమెరికా ఫెడ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు పసిడి ధర ఒత్తిడిని పెంచాయని నిపుణులు వివరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 3,930 నుంచి 4,000 డాలర్లలో ఉండే అవకాశం ఉందని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ అంచనా వేశారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మరింత తగ్గితే మన దగ్గర కూడా ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. పరిస్థితులు ఇంకా భిన్నంగా ఉంటే ఔన్సు పసిడి ధర 3,600-3,750 డాలర్ల వరకు పడిపోయే అవకాశం ఉంటుందని సింగ్ పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో ధరలు పడిపోయే అవకాశం లేదని ఆయన భావిస్తున్నారు. బంగారం ధర మరో 25 శాతం తగ్గితే.. ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,34,000 తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతకు మించి పసిడి ధర తగ్గకపోవచ్చని విశ్లేషించారు. తులం బంగారం రూ.లక్షకు దిగిరావాలంటే అంతర్జాతీయంగా ఔన్సు ధర దాదాపు 2,800 డాలర్లకు తగ్గలని పేర్కొంటున్నారు. అయితే ఇది జగడం దాదాపు అసంభవమని తెలిపారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా దేశాలు డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాకుండా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. దీంతో బంగారం ధరలు పెరిగే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. అమెరికా భారీగా అప్పులు చేయడం కూడా బంగారం ధరలకు మద్దతిచ్చే అంశంగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
