Silver Price: గరిష్ట స్థాయి నుంచి కిలోకు రూ.2 లక్షలు తగ్గిన వెండి.. ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా..!

వెండి ధర భారీగా పడిపోయింది. ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల నుంచి వెండి ధరలు దాదాపు 50 శాతానికి పైగా పడిపోయింది. కొన్ని నెలల క్రితం ఒకప్పుడు కేజీ రేటు రూ.4 లక్షలు దాటి వెండి ధర ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. ఇంత భారీగా పడిపోవడంతో ఇప్పుడు వెండిలో పెట్టుబడి పెట్టొచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. అయితే వెండి ధర ఇంకా తగ్గితే ఎలా చాలా మందికి డౌట్ ఉంది. వెండి ధర మరింత దగ్గే వరకు వేచి చూడాలా లేక ఇప్పుడే పెట్టుబడి పెట్టాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ ఏడాది జనవరి 28న వెండి ధర అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు ఏకంగా 117 డాలర్ల ఆల్‌టైమ్ హైకి పెరిగింది.

అక్టోబర్ 23 నాటికి ఏకంగా 53 శాతం పడిపోయి కేవలం 54 డాలర్ల వద్ద ట్రేడయింది. అంటే కేజీ రూ.4 లక్షల స్థాయి నుంచి ప్రస్తుతం రూ.లక్షా 90వేలకు చేరుకుంది. MCX వేదికగా జనవరి 29న కిలో వెండి రికార్డు స్థాయిలో రూ. 3లక్షల 79వేల 983కి ఎగబాకగా.. అక్టోబర్ 23 నాటికి ఏకంగా రూ. లక్షా 94వేల 170కి తగ్గింది. ప్రస్తుతం భవిష్యత్తు కాంట్రాక్టుల నేపథ్యంలో అక్టోబర్ 26 నాటికి కిలో వెండి రూ. లక్షా 95వేల 500 వద్ద కొనసాగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, డాలర్ బలపడటం వంటి పలు అంశాలు వెండి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని నిపుణులు చెబుతున్నారు.

silver

అయితే ధరలు సగానికి పైగా తగ్గాయని ఇదే సరైన కొనుగోలు సమయమని భావించి దూకుడుగా వ్యవహరించడం ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. వెండి అనేది బంగారం కంటే ఎక్కువ ఓలటాలిటీ కలిగిన లోహమని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ధరలు ఇంకాస్త తగ్గే అవకాశం లేదా మార్కెట్ స్థిరపడే వరకు కొత్త కొనుగోళ్లకు తొందరపడకూడదని సూచిస్తున్నారు. బంగారంలా కాకుండా వెండికి పారిశ్రామికంగా విపరీతమైన డిమాండ్ ఉందని చెబుతున్నారు. సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగం అంతకంతకూ పెరుగుతోందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే దీర్ఘకాలంలో వెండి మంచి రాబడులను అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కాబట్టి ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా.. క్రమక్రమంగా పెట్టుబడి పెడితే మంచిదని సూచిస్తున్నారు. IP పద్ధతిలో కొద్దికొద్దిగా కూడబెట్టుకోవడం బెస్ట్ అని నిపుణులు పేర్కొంటున్నారు. అక్టోబర్ 27-28 తేదీల్లో జరగనున్న ఫెడ్ సమావేశం, పీసీఈ ద్రవ్యోల్బణ డేటా వంటి అంశాలను గమనిస్తూ అడుగువేయడం ఇన్వెస్టర్లకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. బంగారం కూడా గరిష్ట స్థాయి నుంచి దాదాపు 24 శాతం తగ్గింది. ఇందులో కూడా ఒకసారి కాకుండా క్రమక్రమంగా పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+