మన నిత్య జీవితంలో ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్‌లు భాగమైపోయాయి. ఆఫీసుకెళ్లాలన్నా, అర్జంటుగా ఎక్కడికైనా వెళ్లాలన్నా వెంటనే మొబైల్ తీసి రైడ్ బుక్ చేసుకుంటాం. అయితే, మనకు సేవలు అందించే ఈ గిగ్ వర్కర్లు (Gig Workers) ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7వ తేదీ.. శనివారం నాడు దేశవ్యాప్త నిరసనకు సిద్ధమయ్యారు. దీనిని 'ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్' (All India Breakdown) అని పిలుస్తున్నారు.

నిరసన ఎందుకు? ప్రధాన డిమాండ్లు ఏమిటి?
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) తో పాటు ఇండియన్ లేబర్ వెల్ఫేర్ ఫెడరేషన్ వంటి అనేక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. వీరి ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. అగ్రిగేటర్ సంస్థలు (Ola, Uber, Rapido) ఛార్జీలను తమకు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయిస్తున్నాయని, దీనివల్ల డ్రైవర్లకు గిట్టుబాటు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్' అమలులో ఉన్నప్పటికీ.. సంస్థలు వాటిని పట్టించుకోవడం లేదని యూనియన్ నేతలు అంటున్నారు. కనీస బేస్ ఫేర్ ను (Minimum Base Fare) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సొంత అవసరాల కోసం వాడే ప్రైవేట్ వాహనాలను (White Plate) కమర్షియల్ పనుల కోసం వాడటాన్ని కఠినంగా అరికట్టాలని కోరుతున్నారు.
ఆరు గంటల పాటు నిలిచిపోనున్న సేవలు
ఈ నిరసనలో భాగంగా ఫిబ్రవరి 7న సుమారు ఆరు గంటల పాటు గిగ్ వర్కర్లు తమ యాప్‌లను ఆఫ్ చేసి, రోడ్లపైకి రాకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విమానాశ్రయాలకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి రావచ్చు.
గిగ్ ఎకానమీలో పెరుగుతున్న సవాళ్లు
భారతదేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య ఏటికేడూ భారీగా పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 1.2 కోట్లకు చేరింది. అంటే మన దేశ మొత్తం శ్రామిక శక్తిలో 2 శాతం మంది ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడం, డిజిటల్ పేమెంట్స్ సులభతరం కావడంతో ఈ రంగం వేగంగా విస్తరించింది. అయితే విస్తరణ జరుగుతున్నా వారి ఆదాయాల్లో మాత్రం స్థిరత్వం లేదు. ఆర్థిక సర్వే ప్రకారం.. దాదాపు 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు రూ. 15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. పెట్రోల్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు పెరగడంతో వారి చేతికి మిగిలేది చాలా తక్కువగా ఉంటోంది. గత డిసెంబర్ నెలలో కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ తమ వేతనాలు పెంచాలని నిరసనలు చేపట్టిన సంగతి మనకు తెలిసిందే.
ఈ 'ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్' ద్వారా తమ గోడును ప్రభుత్వం వింటుందని గిగ్ వర్కర్లు ఆశిస్తున్నారు. మరి ఈ నిరసనపై అగ్రిగేటర్ సంస్థలు, ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications