Gig Workers: కేంద్రంలో మోదీ సర్కార్ 3.0 కొలువుదీరిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే వివిధ వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పన తుది దశలకు చేరుకోగా జూలై 23న ప్రజల ముందుకు తీసుకురానున్నారు.
ఈసారి ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌లో ప్రధానంగా ఇ-కామర్స్ కంపెనీలు, తయారీ, నిర్మాణ సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న లక్షలాదిమంది గిగ్ వర్కర్స్‌కు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి కీలక ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. ఆర్థిక మంత్రి సీతారామన్ 2024 బడ్జెట్‌లో సామాజిక భద్రతా నిధిని ప్రకటించవచ్చుని, దీనికి కంపెనీలు మరియు ప్రభుత్వం నుంచి సహకారం కూడా ఉంటుంది. ఈ ఫండ్ గిగ్ కార్మికులకు యాక్సిడెంటల్ & హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచడానికి ఉపయోగించబడుతుంది.

మూలాల ప్రకారం రానున్న యూనియన్ బడ్జెట్‌లో అసంఘటిత రంగాలు, అన్ని కంపెనీల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికుల కోసం ప్రభుత్వం జాతీయ సామాజిక భద్రతా బోర్డును ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇది తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న కోట్లాది మంది కుటుంబాలకు ESIC తరహాలో వైద్య చికిత్స ప్రయోజనాలను అందిస్తుంది. క్యాజువల్ ఉద్యోగులకు ఈ ఫండ్ నుంచి పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర సౌకర్యాలను కూడా బడ్జెట్‌లో ప్రకటించవచ్చని వినిపిస్తోంది.
గిగ్ కార్మికుల సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం ప్రభుత్వ పథకం ప్రకారం, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందేందుకు గిగ్ వర్కర్లు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. వీరికి ఉపాధి కల్పించే కంపెనీలే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదనంగా కంపెనీలు తమ ఆదాయంలో 1-2% ఈ సామాజిక భద్రతా నిధికి అందించాలని కోరవచ్చు. నిర్మాణ సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమైన కంపెనీలు సామాజిక భద్రతా నిధి కోసం సేకరణ భారాన్ని భరించవలసిందిగా కూడా కోరవచ్చు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థల నుంచి వసూలు చేసిన జరిమానాలు కూడా సామాజిక భద్రతా నిధికి జమ చేయబడతాయి.
అసలు గిగ్ వర్కర్స్ అంటే ఏమిటి?
ప్రస్తుత రోజుల్లో చాలా సహజంగా వినిపిస్తున్న మాట గిగ్ వర్కర్స్. వాస్తవానికి వీరు అవసరానికి అనుగుణంగా వివిధ రంగాల్లో తాత్కాలికంగా ఉపాధి పొందుతుంటారు. మరింత వివరంగా చెప్పాలంటే.. ఫ్యాక్టరీలలోని కాంట్రాక్ట్ కార్మికులు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్ట్ కంపెనీల ఉద్యోగులు, IT కంపెనీల కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ ఆధారిత ఉద్యోగులు మెుదలైన వారు ఇందులో ఉంటారు. ప్రస్తుతం మనం రోజూ మార్కెట్లో చూస్తున్న ఓలా, ఉబెర్, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, జెప్టో సహా అనేక స్టార్టప్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు గిగ్ కేటగిరీ కిందకు వస్తారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications