2026 నూతన సంవత్సర వేడుకల వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు (డెలివరీ ఏజెంట్లు) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు (Bengaluru)లో గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం శూన్యంగా ఉంది. ఇన్సెంటివ్ల ఎరతో కంపెనీల మాస్టర్ ప్లాన్ వేయడంతో డెలివరీలు యథావిధిగా సాగాయి. సిలికాన్ సిటీ బెంగళూరులో ఈ సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు ప్రకటించిన భారీ ఇన్సెంటివ్ ల ధాటికి యూనియన్ల 'యాప్ బంద్' పిలుపు నీరుగారిపోయింది. నగరంలోని మెజారిటీ డెలివరీ బాయ్స్ యథావిధిగా విధుల్లో పాల్గొనడంతో ఫుడ్ డెలివరీలకు ఎక్కడా ఆటంకం కలగలేదు.

సమ్మె ఎందుకు? డిమాండ్లు ఏమిటి?
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT), గిగ్ సర్వీస్ వర్కర్ల యూనియన్లు డిసెంబర్ 31న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా కంపెనీలు ప్రవేశపెట్టిన '10 నిమిషాల డెలివరీ మోడల్' వల్ల డెలివరీ ఏజెంట్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు లోని నార్త్, ఈస్ట్ ప్రాంతాల్లో ఈ సమ్మె ప్రభావం స్వల్ప ప్రభావం కనిపించినా.. మిగిలిన చోట్ల అంతా డెలివరీలు మామూలుగానే సాగాయి.
కార్మికులను ఊరించిన 'డబుల్ ఎర్నింగ్స్' ఆఫర్
సమ్మె వల్ల ఆర్డర్లు ఆగిపోకుండా ఉండేందుకు స్విగ్గీ, జొమాటో కంపెనీలు భారీ వ్యూహాన్ని అమలు చేశాయి. బెంగళూరు లో స్విగ్గీ 'డబుల్ ఎర్నింగ్స్' పేరుతో ఒక ప్రమోషనల్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 6 గంటల వ్యవధిలో (రాత్రి 6 నుంచి 12 గంటల మధ్య) 19 ఆర్డర్లు పూర్తి చేస్తే రూ. 2,175 ఇస్తామని ఆశ చూపింది. జొమాటో కూడా లాగిన్ సమయాన్ని బట్టి అదనపు చెల్లింపులు చేస్తామని ప్రకటించడంతో.. డెలివరీ ఏజెంట్లు సమ్మెను పక్కనపెట్టి ఆర్డర్ల వెంట పరుగులు తీశారు.
పొట్టకూటి కోసం తప్పని తిప్పలు
చాలా మంది డెలివరీ బాయ్స్.. అసలు సమ్మె జరుగుతుందన్న విషయమే తమకు తెలియదని చెబుతున్నారు. "మాకు పని పరిస్థితులు కష్టంగా ఉన్న మాట నిజమే, కానీ న్యూ ఇయర్ రోజు ఎక్కువ సంపాదించుకునే అవకాశం వదులుకోలేం. కుటుంబం గడవాలంటే ఈ ఆదాయం అవసరం" అని బ్లింకిట్‌లో పనిచేసే ఒక డెలివరీ బాయ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీలు కేవలం పండగల రోజే కాకుండా, ఏడాది పొడవునా ఇలాంటి గౌరవప్రదమైన వేతనాలు ఇస్తే సమ్మె చేయాల్సిన అవసరం ఉండదని యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
సిటిజన్ల మద్దతు ఉన్నా..
సోషల్ మీడియా వేదికగా బెంగళూరు ప్రజలు గిగ్ వర్కర్ల సమ్మెకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఆ రోజు ఆర్డర్లు చేయబోమని చాలా మంది ప్రతిజ్ఞ చేశారు. అయినప్పటికీ.. కంపెనీలు ప్రకటించిన ఆకర్షణీయమైన ఇన్సెంటివ్లు కార్మికుల ఐక్యతను దెబ్బతీశాయనే చెప్పాలి. మొత్తానికి 2026 న్యూ ఇయర్ వేళ బెంగళూరులో ఫుడ్ డెలివరీ వ్యవస్థ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగింది. మరి గిగ్ వర్కర్ల సమస్యల కోసం కంపెనీలు, ప్రభుత్వాలు మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల కొరత! దెబ్బకు పడిపోయిన కూరగాయల ధరలు!

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..

బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్‌పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..

Bengaluru: బెంగళూరులో ఫుడ్ ధరలకు రెక్కలు! దోశ, ఇడ్లీ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!



Click it and Unblock the Notifications