Gift Nifty: జులై 3 నుంచి 22 గంటల పాటు ట్రేడింగ్ చేయ్యొచ్చు..!
SGX నిఫ్టీ కొత్త పేరు (GIFT నిఫ్టీ) జూలై 3 నుండి రోజుకు 22 గంటలపాటు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఓ వార్త సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇదే జరిగితే అన్ని డాలర్-డినామినేటెడ్ నిఫ్టీ డెరివేటివ్స్ కాంట్రాక్టులు GIFT సిటీలో NSE IFSC నుంచి పూర్తిగా వర్తకం చేయవచ్చు. గిఫ్ట్ నిఫ్ట్ లో డెరివేటివ్ కాంట్రాక్ట్ ట్రేడింగ్ డాలర్లలో చేయవచ్చు.
GIFT నిఫ్టీ - డాలర్-డినామినేటెడ్ నిఫ్టీ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు - తెల్లవారుజాము 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 2 AM IST వరకు ట్రేడింగ్‌ను అనుమతించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చర్చల్లోని ఒక వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం, SGX నిఫ్టీలో ట్రేడింగ్ ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు 16 గంటల పాటు జరుగుతుంది.

చాలా మంది భారత మార్కెట్లు ప్రారంభానికి ముందు SGX నిఫ్టీని పరిశీలిస్తారు. తదనుగుణంగా భారత మార్కెట్లు ఉంటాయని ఓ అంచానా ఉంది. ట్రేడింగ్ సమయం పెంచడం వల్ల విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా నుంచి డాలర్లలో నిఫ్టీ ప్యూచర్లలో ట్రేడింగ్ చేసే అవకాశం ఉంది. దీని వల్ల లిక్విడిటీ పెరుగుతోంది.
"ఇప్పుడు ట్రేడ్‌ల పరిష్కారం GIFT సిటీలో జరుగుతుంది, ట్రేడింగ్ గంటలను పొడిగించవచ్చని భావించబడింది" అని చర్చల్లో పాల్గొన్న వ్యక్తి చెప్పారు.
ఈ విషయంపై ప్రశ్నకు ఎన్‌ఎస్‌ఇ స్పందించలేదు. "ఆర్థిక ఉగ్రవాదం పెరుగుతున్న సందర్భాలతో, భారతదేశంలోని మార్కెట్లు తెరవడానికి ముందే నిఫ్టీ ఫ్యూచర్‌లను దెబ్బతీయడం ద్వారా భారతదేశ ఆర్థిక మార్కెట్లను అస్థిరపరచాలని కోరుకునే కొన్ని శత్రు దేశాలు ఆ పని చేసే అవకాశం ఉంది"అని వ్యక్తి చెప్పారు.
జూన్ 30, 2023న, లిక్విడిటీ స్విచ్‌లో భాగంగా SGX నిఫ్టీలోని అన్ని ఓపెన్ పొజిషన్‌లు ఆటోమెటిక్ గా NSE IFSCకి మారనున్నాయి. GIFT నిఫ్టీ 22 ట్రేడింగ్ వల్ల ఇతర మార్కెట్ల ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications