Telangana: టీఎస్ బీపాస్ ద్వారా జీహెచ్ఎంసీకి రూ.1,454.76 కోట్ల లాభం
తెలంగాణలో 2022-23లో TS-bPASS ద్వారా 13,748 బిల్డింగ్ పర్మిట్లు, 2,581 ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు (OCs) జారీ చేశారు. ఇలా జారీ చేయడం ద్వారా GHMCకి రూ.1,454.76 కోట్ల ఆదాయం సమకూరింది. భవన నిర్మాణ అనుమతులు, ఓసీల జారీ ద్వారా జీహెచ్‌ఎంసీకి గతేడాది రూ.1,144.08 కోట్ల ఆదాయం వచ్చింది. భవన నిర్మాణ అనుమతుల త్వరిత ప్రాసెసింగ్‌ను నిర్ధారించడానికి TS-bPASSని 2020లో ప్రారంభించారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో, మంజూరు చేసిన 13,748 అనుమతులలో 97 ఎత్తైన భవనాలు ఉన్నాయి.
40 అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తుతో నాలుగు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లకు అనుమతి ఇచ్చారు. 53 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు 30 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో (10 అంతస్తుల పైన, 40 అంతస్తుల వరకు) పర్మిషన్ ఇచ్చారు. 0 మీటర్ల కంటే ఎక్కువ (10 అంతస్తుల పైన) ఎత్తుతో ఏడు వాణిజ్య ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు.

40 అంతస్తుల పైన ఉన్న ఒక వాణిజ్య ప్రాజెక్టుకు పర్మిషన్ ఇచ్చారు. ఏప్రిల్1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు ఈ అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఇచ్చిన వాటిలో 183 వాణిజ్య భవనాలు, 43 ఆస్పత్రులు, 13,522 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 13,748 భవనాలకు అనుమతి ఇచ్చారు.


Click it and Unblock the Notifications