ఉద్యోగ జీవితంలో ఆకస్మికంగా డబ్బు అవసరం వచ్చినప్పుడు, చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా. కొన్ని సంవత్సరాల క్రితం వరకు పీఎఫ్ డబ్బు తీసుకోవడం అంటే చాలా నెమ్మదిగా జరిగే పని అని అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో వచ్చిన తర్వాత, ఈ ప్రక్రియ చాలా త్వరగా, సులభంగా పూర్తవుతోంది. ఈ సేవలు చాలా వేగంగా, సులభంగా అందుబాటులో ఉన్నాయి. కొద్ది క్లిక్లతోనే మీ పీఎఫ్ డబ్బు 72 గంటల్లోగా మీ బ్యాంక్ ఖాతాలోకి చేరేయొచ్చు. మరి, మీ పేరు మీద ఉన్న పీఎఫ్ డబ్బును అవసరంలో తక్షణమే ఎలా విత్ డ్రా చేసుకోవచ్చో చూద్దాం.

మీరు ఎలా పీఎఫ్ డబ్బు తీయాలో, ఏ సైట్‌కి వెళ్లాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ మెచ్చేలా వివరంగా తెలియజేస్తాం.
స్టెప్ బై స్టెప్ గైడ్: PF డబ్బు ఎలా తీయాలి?
1. ముందుగా EPFO యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. మీ UAN నంబర్ (ఉనిక్ అకౌంట్ నంబర్) మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
3. హోమ్ పేజీలోని 'Online Services' ట్యాబ్‌కి వెళ్లండి.
4. అక్కడ 'Claim (Form-31, 19, 10C & 10D)' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
5. తర్వాత మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ నంబర్, KYC వివరాలు అన్నీ వెరిఫై చేయాలి.
6. వెరిఫికేషన్ అయిన తర్వాత, డబ్బు ఎందుకు తీసుకుంటున్నారో (Medical, Education, Marriage, etc) సెలెక్ట్ చేయాలి.
7. ఫారం పూర్తి చేసి, OTP ద్వారా సబ్మిట్ చేయాలి.
డబ్బు వచ్చే టైం ఎంత?
మీ అన్ని వివరాలు సరైనవిగా ఉంటే (UAN, ఆధార్, బ్యాంక్, PAN, KYC అన్ని అప్డేట్ అయి ఉంటే), మీరు సబ్మిట్ చేసిన క్లెయిమ్ వెరీఫై అయిన వెంటనే 72 గంటల్లోగా డబ్బు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది.
కొందరికి కొన్ని గంటల్లోనే జమ అయిన అయినట్టు ఉన్నాయి. కానీ 3 రోజుల్లో డబ్బు వస్తుందని EPFO చెప్తుంది.
ముఖ్య గమనికలు:
ఫారం ఫిల్ చేసేటప్పుడు తప్పులు చేయొద్దు. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్ అన్ని సరిగ్గా ఉన్నాయో డబుల్ చెక్ చేసుకోండి. KYC పూర్తయ్యి ఉండాలి. లేకపోతే ముందే కస్టమర్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలి. ఓటీపీ వస్తుంది కాబట్టి, మీ ఆధార్ నంబర్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉంచాలి.
మీరు పై విధంగా ప్రక్రియను అనుసరిస్తే మీ పీఎఫ్ డబ్బు వేగంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా మీ బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది. ఇప్పుడు వెనకాడాల్సిన అవసరం లేదు. మీ వివరాలు సరిగ్గా ఉండి, అన్ని డాక్యుమెంట్లు అప్డేట్లో ఉంటే, అత్యవసర సమయంలో మీ పీఎఫ్ మీకు బలమైన ఆర్థిక సహాయం చేస్తుంది.


Click it and Unblock the Notifications