For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోఆపరేటివ్ బ్యాంకుల నుండి ఇక డబుల్ హోమ్ లోన్

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)... సహకార బ్యాంకుల రుణాలపై ఇప్పటికే ఉన్న రుణ పరిమితిని భారీగా పెంచింది. పెరిగిన హోమ్ లోన్ పరిమితులు ప్రాథమిక అర్బన్ సహకార బ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు రెండింటికి వర్తిస్తాయి. ఈ బ్యాంకులకు రూ.1.40 కోట్ల వరకు హోమ్ లోన్ పరిమితులు సవరించబడ్డాయి. ఈ పరిమితులను గతంలో సవరించినప్పటికీ ఇప్పటి వరకు ఇళ్ల ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకొని, ప్రస్తుత పరిమితులను పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది.

పట్టణ సహకార బ్యాంకులు 2011లో, గ్రామీణ సహకార బ్యాంకులు 2009లో ఈ హోమ్ లోన్ పరిమితులు చివరిసారి సవరించారు. రూ.30 లక్షల వరకు హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు రూ.70 లక్షల వరకు, రూ.60 లక్షల వరకు రుణాన్ని అందించే బ్యాంకులు రూ.1.40 కోట్ల వరకు రుణాలు ఇచ్చే విధంగా ఆర్బీఐ సవరించింది. రూ.100 కోట్ల కంటే తక్కువ నికర వ్యాల్యూ కలిగిన గ్రామీణ సహకార బ్యాంకులకు సంబంధించి రూ.20 లక్షల నుండి రూ.50 లక్షల వరకు పెంచారు. గ్రామీణ సహకార బ్యాంకులు రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు పెంచారు.

Get more home loan from a cooperative bank

ఆర్బీఐ సహకార బ్యాంకులను మిగతా బ్యాంకుల వలె సమాన భాగస్వాములుగా పరిగణించింది. దీంతో వారి రుణ పరిమితిని 100 శాతం పెంచింది. అంటే ఈ బ్యాంకులు ఇప్పటి వరకు ఇస్తున్న మొత్తం కంటే రెట్టింపు రుణాలను ఇస్తాయి. ఈ నిర్ణయం రియాల్టీ రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

English summary

కోఆపరేటివ్ బ్యాంకుల నుండి ఇక డబుల్ హోమ్ లోన్ | Get more home loan from a cooperative bank

RBI has decided to increased the existing limits on individual housing loans provided by cooperative banks, taking into account the rise in housing prices since the limits were last revised and considering customers needs for larger loans.
Story first published: Thursday, June 9, 2022, 13:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X