Digital Payments: భారత దేశంలో డిజిటల్ మనీ విప్లవం ప్రజల్లోకి విపరీతంగా చొచ్చుకెళ్లినట్లు ఇప్పటికే పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. UPI తరహా చెల్లింపులను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఈ ఎకోసిస్టమ్ ను అనేక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. తాజాగా సందీప్ మాల్ అనే వ్యక్తి ట్వీట్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దేశీయ పేమెంట్ సిస్టం గురించి జర్మన్ ప్రజలు ఏమంటున్నారో అందులో వివరించారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో ఎంటర్ ప్రెన్యూర్ సందీప్ మాల్ ఓ పోస్ట్ షేర్ చేశారు. డిజిటల్ పేమెంట్స్ విధానం ద్వారా దేశంలో సులభంగా చేస్తున్న చెల్లింపులను చూసి తమ జర్మన్ కస్టమర్ ఆశ్చర్యపడినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన నెటిజన్లతో పంచుకున్నారు. Paytm బాస్ విజయ్ శేఖర్ శర్మను తన పోస్టులో ట్యాగ్ చేశారు.

'నా జర్మన్ కస్టమర్ లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ కోసం బయటకు వెళ్లాను. తిన్న తరువాత Paytmని ద్వారా డబ్బు చెల్లించాను. ఇంత సులభంగా, వేగంగా జరిగిన డిజిటల్ పేమెంట్ చూసి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. డిజిటల్ మనీలో భారతదేశం కంటే జర్మనీ 20 సంవత్సరాలు వెనుకబడి ఉందని వారు తెలిపారు. అందుకే @vijayshekhar గారు మీ కోసం దీన్ని రికార్డ్ చేసాను' అని సందీప్ మాల్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇండియాలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఏళ్లతరబడి గణనీయంగా విస్తరించింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. 2022లో రూ.2,050 లక్షల కోట్ల విలువైన 9 వేల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో తమ చెల్లింపుల వాల్యూమ్ 40 శాతం, నెలవారీ లావాదేవీల వినియోగదారులు 40 శాతం చొప్పున పెరిగినట్లు Paytm పేర్కొంది. దీంతో దాని మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ షేర్లు బుధవారం దూసుకుపోయాయి. Paytm మాత్రమే కాక PhonePe, BharatPe వంటి అనేక సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications