EV: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఆయా కంపెనీలు సైతం EV రంగంలోకి అడుగుపెడుతున్నాయి. కానీ బ్యాటరీలలో వినియోగించే లిథియం కోసం అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. భూలోక స్వర్గంగా పిలుచుకునే జామ్మూ కాశ్మీర్, విలువైన లిథియం నిల్వలను తన గర్భంలో దాచుకున్న విషయం తాజాగా బయటపడింది. భారతీయ EV పరిశ్రమలో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.

భారీ నిల్వలు
జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున లిథియం నిల్వలను కనుగొన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. 5.9 మిలియన్ టన్నుల మేర ఉండవచ్చని పేర్కొంది. కాగా ఇప్పటివరకు భారత్ లో కనుగొన్న లిథియం నిల్వల్లో ఇదే అతి పెద్దది కావడం విశేషం. తద్వారా EV రంగంలో ప్రపంచంతో ఇండియా పోటీపడగలదని నిపుణులు భావిస్తున్నారు. ఈ అరుదైన ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో వినియోగిస్తారు.

స్వయం సమృద్ధి దిశగా..
భారత లిథియం అవసరాల్లో 70 శాతం చైనా, హాంకాంగ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు గ్రీన్‌ఫ్యూయల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అక్షయ్ కశ్యప్ తెలిపారు. జమ్మూ, కాశ్మీర్ లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) కనుగొన్న లిథియం నిల్వలు భారత్ కు అత్యంత కీలకమైనవన్నారు. వీటిని సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే, ఈ విషయంలో స్వయం సమృద్ధి సాధించవచ్చన్నారు.

ఆత్మనిర్భర భారత్ సాధనకు..
ప్రస్తుతం 1 శాతంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని 2030 నాటికి 30 శాతానికి తీసుకెళ్లాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2070 నాటికి జీరో ఉద్గారాలను చేరుకోవడమే పరమావధిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో EVలు, బ్యాటరీల్లో వినియోగించే లిథియం కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటే నిజమైన ఆత్మనిర్భర భారత్ సాధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచంలో రెండో స్థానం
ప్రపంచంలోనే అత్యధికంగా 9.2 మిలియన్ టన్నులు లిథియం నిల్వలు చిలీలో ఉన్నాయి. తర్వాత ఆస్ట్రేలియాలో 5.7 మిలియన్లు, చైనాలో 1.5 మిలియన్లు, బ్రెజిల్ లో 95 వేలు, పోర్చుగల్ లో 66 వేల టన్నులు ఉన్నట్లు అంచనా. భారత్ లో తాజాగా బయటపడిన 5.9 మిలియన్ టన్నులను బట్టి చూస్తే మనం రెండో స్థానంలో ఉన్నట్టే.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications