Multibagger Stock: లక్షల్లో రాబడి అందించే మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలా అరుదుగా ఉంటుంటాయి. అయితే ఇన్వెస్టర్లు వీటిని ఎంచుకుని పెట్టుబడి పెట్టడం ఎంత ముఖ్యమో.. వాటిని కొనసాగించటం కూడా అంతే ముఖ్యం.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది సోలార్ ప్రాజెక్టుల వ్యాపారంలో ఉన్న జెన్సోల్ ఇంజినీరింగ్ కంపెనీ గురించే. దీని షేర్లు గడచిన రెండేళ్ల కాలంలో 2900 శాతం కంటే ఎక్కువ పెరిగి ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.66 నుంచి రూ.2,000 స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.2,119.45గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.797.05గా ఉంది.

అక్టోబర్ 1,2021న జెన్సోల్ ఇంజినీరింగ్ స్టాక్ ధర రూ.66.79 వద్ద ఉంది. ఇటీవల సెప్టెంబర్ 29, 2023న స్టాక్ రూ.2,035 రేటు వద్ద మార్కెట్లో ట్రేడింగ్ ముగించింది. రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను కంపెనీ షేర్లు అందించాయి. ఎవరైనా ఇన్వెస్టర్ అక్టోబర్ 1న లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు దానిని కొనసాగించి ఉంటే దాని మార్కెట్ విలువ రూ.30 లక్షల కంటే ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ల క్యాప్ రూ.2,465 కోట్లుగా ఉంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 101% షేర్లు పెరిగాయి. జనవరి 2, 2023న కంపెనీ షేర్లు రూ.1,013.90 వద్ద ఉన్నాయి. గత 6 నెలల్లో జెన్సోల్ ఇంజినీరింగ్ షేర్లు 80% పెరిగాయి. అలాగే గడచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ 51 శాతానికి పైగా లాభపడింది.


Click it and Unblock the Notifications