Multibagger Stock: గత ఏడాది చివరి త్రైమాసికం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ర్యాలీని కొనసాగిస్తూనే ఉన్నాయి. స్వల్పంగా కరెక్షన్ జరిగినప్పటికీ ఐపీవోల రాకతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగటం పెట్టుబడుల ఆకర్షనకు తోడయ్యాయి.
ఈ క్రమంలో ర్యాలీలో పాల్గొని తన పెట్టుబడిదారులకు సూపర్ లాభాలను అందించిన కంపెనీల జాబితాలో జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ కూడా నిలిచింది. కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కంపెనీని తిరిగి వేగంగా పుంజుకునేలా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో బలమైన రాబడిని అందించిన కంపెనీల్లో జెన్సోల్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. 4 ఏళ్లలో కంపెనీ షేర్ల ధర 5200 శాతం మేర పెరిగాయి. ఈ క్రమంలో లక్ష ఇన్వెస్ట చేసి దీర్ఘకాలం కొనసాగించిన పెట్టుబడిదారులు రూ.50 లక్షల కంటే ఎక్కువ రాబడిని అందుకున్నారు.

ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో పెరుగుదల ట్రెండ్ నేటికీ కొనసాగుతోంది. గత నెలలో కంపెనీ షేర్ల ధర 32 శాతం పెరగగా.. 6 నెలలుగా స్టాక్స్ హోల్డ్ చేస్తున్న పెట్టుబడిదారులు 91 శాతం రాబడులను అందుకున్నారు. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో కంపెనీ షేర్ ధర రూ.1110గా ఉంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 62.59 శాతంగా ఉంది. మిగిలిన వాటా ప్రజల వద్ద పెట్టుబడుల రూపంలో ఉంది. అలాగే డిసెంబర్ 2023 నాటికి కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ 1.51 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ EBITDA 312 శాతం పెరిగి రూ.70 కోట్ల స్థాయికి చేరుకుంది.
2012లో స్థాపించబడిన జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ వాస్తవానికి ఇంజనీరింగ్ & నిర్మాణ సేవలను అందించే సంస్థ. అయితే ఇది సోలార్ పవర్ ప్లాంట్లను కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 240 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ పూణేలో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో మూడు-నాలుగు చక్రాల వాహనాలు ఎక్కడ తయారు చేయబడుతున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications