ప్రపంచ ఐటీ దిగ్గజం జెన్‌పాక్ట్ కొత్తగా తీసుకువచ్చిన 10 గంటల పనివేళలు నిబంధను తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ నిబంధనపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా జెన్‌పాక్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ ఈ మధ్య కొత్తగా 10 గంటల తప్పనిసరి వర్క్‌డే పాలసీని తీసుకువచ్చింది. స్పష్టమైన సమాచారం లేకుండా అమలులోకి తెచ్చిన విధానంతో ఉద్యోగులు ఇటీవలి కొన్ని వారాలుగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ నిర్ణయంపై వారు మండిపడుతున్నారు.
Genpact కంపెనీ జూన్ మధ్య నుంచి ఉద్యోగులకు రోజుకి 10 గంటల యాక్టివ్ వర్క్ తప్పనిసరి చేస్తూ కొత్త పాలసీని అమలులోకి తీసుకువచ్చింది.ఈ పాలసీ ప్రకారం.. ఉద్యోగులు ఒక ప్రత్యేకమైన ప్రొడక్టివిటీ ప్లాట్‌ఫామ్‌లో రోజుకి కనీసం 9 గంటలు పాటు పని చేయాలి. లేదంటే వారికి వార్నింగ్ మెయిల్స్ తో పాటుగా బోనస్ తగ్గింపు, ఇతరత్రా అంశాలపై కంపెనీ నుంచి హెచ్చరికలు అందుతాయి. ఇది అధికారికంగా ప్రకటించకపోయినా టీమ్ లీడ్స్, మేనేజర్లు వారి నోటిమాటలతో పాలసీని అమలు చేస్తున్నారు.ఇక ఈ పాలసీపై ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని తప్పుడు ప్రవర్తన కలిగి ఉన్నారని సర్టిఫికేట్ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ 10 గంటల విధానానికి జీతంలో ఎలాంటి పెంపు లేదు. ఉద్యోగులకు గరిష్ఠంగా 500 పాయింట్లు (రూ. 3,000 విలువ) వరకే రివార్డుగా లభిస్తుంది. అదీ, జస్ట్ రెగ్యులర్ పనికి మాత్రమే. ఇక అదనంగా పనిచేస్తే రూ. 150 బోనస్ ఇస్తారు. దీనిపై ఉద్యోగులు బహిరంగంగా ఎక్కడైనా చెబితే ఉద్యోగం పోతుందేమనని భయపడుతున్నారు. పేరు చెప్పని ఓ ఉద్యోగి దీనిపై మాట్లాడుతూ.. ఇది మేము ఎప్పుడూ విన్న పాలసీ కాదు. ఇది నిబంధనలా అనిపించదు. కానీ దీన్ని వ్యతిరేకిస్తే జాబ్ itself ప్రమాదంలో పడుతుందని చెప్పుకొచ్చారు.
ఇక ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఉద్యోగులపై "WAM" అనే టూల్‌తో ట్యాప్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కీబోర్డు టైపింగ్, స్క్రీన్ యాక్టివిటీ, మౌస్ యూజ్ వంటి వివరాలను ఈ టూల్ సాయంతో ట్రాక్ చేస్తున్నారు. దీని వల్ల ఉద్యోగులు ఫ్రీఢం కోల్పోవడమే కాకుండా మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇక ఈ ఒత్తిడి తట్టుకోలేక LinkedIn, Reddit, X (Twitter) వంటి ప్లాట్‌ఫామ్‌లలో Genpact ఉద్యోగులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం పరుస్తున్నారు.
ఓ ఉద్యోగి పోస్టులో మాట్లాడుతూ.. ఉద్యోగులకు జీవితం మర్చిపోమన్నట్లు ఉంది జెన్ ఫాక్ట్ కంపెనీ తీరు.. 70% మంది ఉద్యోగులు రూ. 10 లక్షల లోపలే సంపాదిస్తుంటే ఇప్పుడు 10 గంటల వర్క్ డే పెట్టారు. బెంగళూరులో ట్రాఫిక్ 3-4 గంటలు దాంతో కలిపితే 14 గంటలు పనికే అంకితం అవ్వాల్సి వస్తుందన్నారు.3-4 WAM వార్నింగ్ మెయిల్స్ వచ్చాయి అంటే బోనస్ తగ్గించి, అప్ప్రైజల్స్ క్లియర్ చేయరు. జీతం పెంచకుండా పని వేళలు పెంచటం అసహనంగా ఉందని మరో యూజర్ పోస్ట్ చేశారు. అయితే దీనిపై Genpact నుంచి ఇంకా అధికారిక స్పందన ఏదీ రాలేదు. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. Genpact మేనేజ్‌మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications