జనరల్ మోటార్స్ ఇండియా 1,086 మంది ఉద్యోగులను తొలగించింది. పుణే సమీపంలోని ఆటో మేకర్స్ ప్లాంట్‌లో స్వచ్చంధ పదవీ విరమణ ప్యాకేజీని అంగీకరించని ఈ ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఘం పారిశ్రామిక కోర్టును ఆశ్రయించి, తన ఉద్యోగులతో న్యాయపోరాటం ప్రారంభించింది. తేల్‌గాన్ సైట్‌లో మూడోవంతు ఉద్యోగులు జూలై 4వ తేదీ లోగా స్వచ్చంధ విభజన పథకానికి అంగీకరించారు. మిగిలిన ఉద్యోగులను జూలై 12వ తేదీన ఈ అమెరికా కంపెనీ తొలగించింది. దీంతో వర్కర్స్ యూనియన్ జూలై 15న ఇండస్ట్రియల్ కోర్టును ఆశ్రయించింది.
ఈ ఫ్యాక్టరీని చైనీస్ ఎస్‌యూవీ మేకర్ గ్రేట్ వాల్ మోటార్స్ లేదా ఇతర ఏ పార్టీకైనా విక్రయించడాన్ని నిలిపివేయాలని వర్కర్స్ యూనియన్ కోరింది. జనరల్ మోటార్స్ 2020 డిసెంబర్ నెలలో ఈ ప్లాంటులో ఉత్పత్తిని నిలిపివేసింది. అలాగే, దీనిని గ్రేట్ వాల్ మోటార్స్‌కు విక్రయించేందుకు అంగీకరించింది. అయితే ప్లాంట్‌లోని కార్మిక సమస్య కారణంగా విక్రయం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో జూలై 16వ తేదీన అత్యవసర విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఆదేశాల వరకు ప్లాంట్‌ను విక్రయించరాదని, లీజుకు ఇవ్వరాదని ఆదేశించింది.

ఆగస్ట్ 33, 2021 వరకు ఈ అంశంపై ముందుకు వెళ్లమని జనరల్ మోటార్స్ కూడా కోర్టుకు తెలిపింది. కంపెనీ ఉద్యోగులను అన్యాయంగా తొలగించిందని, అందుకే తాము ఇండస్ట్రియల్ కోర్టును ఆశ్రయించామని, అక్కడ పోరాడుతున్నామని జనరల్ మోటార్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ సందీప్ భేగాడే అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications