రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రయివేట్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్ రూ.3,675 కోట్లను రిలయన్స్ రిటైల్‌లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఇంతకుముందు రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలో జనరల్ అట్లాంటింక్ రూ.6,598.38 ఇన్వెస్ట్ చేసింది. ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ద్వారా భారీగా పెట్టుబడులు సమీకరించారు. ఇప్పుడు రిలయన్స్ రిటైల్ ద్వారా పెట్టుబడులను సమీకరిస్తున్నారు.

జనరల్ అట్లాంటింక్‌కు 0.84 శాతం వాటా
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (RRVL)లో రూ.3,675 కోట్లు (498.31 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టడం ద్వారా జనరల్ అట్లాంటిక్ 0.84 శాతం వాటాను దక్కించుకోనుంది. రిలయన్స్ రిటైల్‌లోకి ఇది మూడో పెట్టుబడి. ఇంతకుముందు సిల్వర్ లేక్, కేక్ఆర్‌లు ఇన్వెస్ట్ చేశాయి. మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్ రిటైల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా వ్యవహరించింది. సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్, డేవిస్ పోక్ అండ్ వార్డ్‌వెల్ లీగల్ కౌన్సిల్స్‌గా పని చేశాయి.

ప్రీ-మనీ ఈక్విటీ వ్యాల్యూ
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రీ-మనీ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.28 లక్షల కోట్ల వద్ద ఇన్వెస్ట్ చేసింది. కొద్దిరోజుల క్రితం కేకేఆర్ రూ.5,550 కోట్లతో 1.28 శాతం వాటాను, సిల్వర్ లేక్ రూ.7,500 కోట్ల పెట్టుబడితో 1.75 శాతం వాటాను దక్కించుకున్నాయి. రెండు కంపెనీలు కలిపి రూ.13,050 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ఈ రెండు రూ.4.21 లక్షల కోట్ల ప్రీమనీ ఈక్విటీ వ్యాల్యూ వద్ద పెట్టుబడులు పెట్టాయి. భారత రిటైల్ రంగంలో గట్టి పట్టు సాధించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ను ధీటుగా దూసుకు వస్తోంది.

గ్లోబల్ డిజిటల్ ఎకామీలో భారత్ వేగవంతంగా..
జనరల్ అట్లాంటిక్‌తో తమ బంధం మరింతగా విస్తరించిందని, ఇందుకు ఆనందంగా ఉందని, ఈ సంస్థ టెక్నాలజీ నైపుణ్యం, అనుభవం ఉపయోగపడుతుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. జనరల్ అట్లాంటిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిల్ ఫోర్డ్ మాట్లాడుతూ.. రిటైల్ రంగంలో కీలక మార్పులకు దోహదపడుతున్న రిలయన్స్ రిటైల్‌కు జనరల్ అట్లాంటిక్ మద్దతు ఆనందంగా ఉందన్నారు. గ్లోబల్ డిజిటల్ ఎకానమీలో భారత స్థానాన్ని అర్థవంతంగా, వేగవంతంగా చేయడానికి రిలయన్స్ బృందంతో మరోసారి భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications