పెళ్లి వద్దు కానీ వెడ్డింగ్ పార్టీ మాత్రం కావాలి.. దేశంలో ముదురుతున్న ఫేక్ వివాహ వేడుక కల్చర్
భారతీయ నగరాల్లో కొత్త జెన్ Z పార్టీలు ట్రెండ్‌గా
పెళ్లి వేడుకల ఉత్సాహాన్ని ఇష్టపడేవారికి, కానీ భావోద్వేగాలు, సాంస్కృతిక బాధ్యతలు లేకుండా, ఈ ఫేక్ వెడ్డింగ్ వేడుకలు ఢిల్లీ, బెంగళూరు, పూణే వంటి నగరాల్లో త్వరగా ప్రాచుర్యం పొందుతున్నాయి. పెళ్లి జరగకపోయినా, పెళ్లి ఫంక్షన్‌లా థీమ్ పార్టీలను, సంగీత్, మెహందీ వంటి ఈవెంట్లను ప్లాన్ చేసుకుని, వాటిని సెలబ్రేట్ చేయడమే ఇప్పుడు కొత్త ఫ్యాషన్‌గా మారింది.

ఈ థీమ్ పార్టీలు ఏవైనా సాధారణ వేడుకలు కావు. డీజే, లైట్ డెకరేషన్, డాన్స్ ప్రాక్టీసులు, కాఫీ టేబుల్ డికరేషన్, ఫ్యాషన్ కోడ్స్... ఇవన్నీ ఇక్కడ చోటు చేసుకుంటాయి. పెళ్లికి బదులు "వెడ్డింగ్ వితౌట్ మారేజ్", "సింగిల్ సెలబ్రేషన్ నైట్", "ఫేక మెహందీ బష్" వంటి పేర్లతో ఈ ఫంక్షన్లు జరుగుతున్నాయి. మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొంటారు. పూర్తిగా ఫన్, ఫ్రీడమ్, ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే ఈ వేడుకలు జెన్ Z యొక్క స్వేచ్ఛా ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.
ఢిల్లీ, బెంగళూరు, పూణే వంటి నగరాల్లో ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. కంటెంట్ క్రియేటర్ ముకుల్ ఖురానా ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు, "మీరు ఈ పెళ్లికి హాజరవుతారా? మీ అభిప్రాయం ఏమిటి? ఇది కేవలం ఫ్యాడ్ గానా లేదా వ్యాపార మోడల్ అవుతుందా?". ఢిల్లీలో ఇలాంటి థీమ్ పార్టీలు నిర్వహించే జుమ్మా కీ రాత్ సంస్థ ప్రవేశానికి రూ. 500 నుంచి రూ. 3,000 వరకు ఛార్జ్ చేస్తుంది.
ఆసక్తికరంగా, ఈ ట్రెండ్ కేవలం భారతదేశంలోనే కాదు. ముకుల్ ఖురానా, ఇది అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల రెండు రోజుల ఫేక్ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఆలోచన భారతీయ సరిహద్దుల దాటి కూడా ప్రాచుర్యం పొందుతోందని సూచిస్తుంది. ఇవి సోషల్ మీడియాలో జనాలు ఇచ్చే స్పందనలు, ఆశ్చర్యకరంగా, విభిన్నంగా ఉన్నాయి.
ఇది పెళ్లి వ్యవస్థను తక్కువ చేయడము కాదు. కానీ, "పెళ్లి తప్పనిసరి కాదు, సెలబ్రేట్ చేయాలనిపించే జీవితాన్ని మాత్రం ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు" అనే సందేశాన్ని ఈ తరం ఇస్తోంది. తమ జీవితంలో ఒక ప్రత్యేక దశకు అడుగుపెడుతున్న సందర్భంగా, ఆ హ్యాపినెస్‌ను ఒక వేడుకగా మలచుకుంటున్నారు. పెళ్లి లేకుండానే వేడుక చేసుకోవడంలో ఇప్పుడు సాంప్రదాయం + ట్రెండ్ మిక్స్ చెయ్యడం... జెన్ Z తరానికి ఇది కొత్తగా కనిపించదు, కానీ వారికిది ఓ ప్రత్యేకమైన వ్యక్తీకరణ.
జెన్ Zలో అందరూ కలిసి ఆనందించే ధోరణి ఎక్కువ. అందరూ కలిసిమెలిసి సెలబ్రేట్ చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. ఈ థీమ్ పార్టీలో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆచారాలు, రూల్స్ ఉండవు. కేవలం ఫ్రెండ్స్‌తో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. పెళ్లిలో ఉండే డ్రామా, బాధ్యతలు ఉండవు. ఇక్కడ ఈ పార్టీ చేసుకోడానికి నిజమైన పెళ్లి ఖర్చుతో పోలిస్తే, ఫేక్ వెడ్డింగ్ పార్టీలకు ఎంట్రీ టికెట్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది (రూ.500 నుంచి రూ.3,000 వరకు). పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండా పెళ్లి అనుభూతిని పొందొచ్చు. ఈ కారణాల వల్ల ఫేక్ వెడ్డింగ్స్ ట్రెండ్ మెట్రో నగరాల్లో యువతలో వేగంగా పాపులర్ అవుతోంది.


Click it and Unblock the Notifications