ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తోందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ హెచ్చరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ మైనస్ 5 శాతంగా నమోదు కావొచ్చునని మంగళవారం అంచనా వేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ అమలు చేస్తోంది. దీంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో స్వాతంత్రానంతరం నుండి గతంలో ఎన్నడూ చూడని మహామాంద్యాన్ని భారత్ చూడబోతోందని క్రిసిల్ పేర్కొంది.

జీడీపీ -25.. చాలా భయంకరమైన మాంద్యం
ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్‌లో జీడీపీ మైనస్ 25% పడిపోవచ్చని పేర్కొంది. దాదాపు 10% వాస్తవిక జీడీపీని శాశ్వతంగా నష్టపోయినట్లేనని తెలిపింది. అంటే కరోనాకు ముందు వృద్ధి రేటును వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారత్ అందుకోవడం కష్టమేనని పేర్కొంది. గత 69 ఏళ్లలో భారత్ కేవలం మూడుసార్లు మాంద్యాన్ని చవిచూసిందని, 1958, 1966, 1980ల్లో మాంద్యాన్ని ఎదుర్కొందని, ప్రతిసారి వర్షాభావ పరిస్థితుల వల్లే ఏర్పడిందని, అది వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, కానీ ఈసారి మాంద్యం గత మూడు మాంద్యాల కంటే చాలా చాలా భయంకరమైనదని తెలిపింది.

ఇవి దారుణంగా దెబ్బతిన్నాయి
మొదటి క్వార్టర్‌లో వ్యవసాయేతర ఆర్థిక వ్యవస్థలో సేవల విభాగం అయిన విద్య, ప్రయాణం, పర్యాటకాలు దారుణంగా దెబ్బతిన్నాయని తెలిపింది. ఇది రాబోవు త్రైమాసికంలోను కొనసాగవచ్చునని తెలిపింది. ఉద్యోగులు, ఆదాయాల్లో కోతలు ఏర్పడవచ్చునని, ఈ రంగాలు పెద్ద మొత్తంలో ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపింది. ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించి దారుణంగా నమోదవుతున్నాయని, పారిశ్రామికోత్పత్తి మార్చి నెలలో 16 శాతానికి పైగా క్షీణింిందని, ఏప్రిల్ నెలలో ఎగుమతులు 60.3 శాతం తగ్గాయని పేర్కొంది. కొత్త టెలికం కస్టమర్లు 35 శాతం మేర తగ్గారని, రైల్వే సరుకు రవాణా 35 శాతం తగ్గిందని తెలిపింది.

ఇది కొంతలో కొంత సానుకూలం
ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాను ఏప్రిల్ 28న 3.8 శాతం నుండి 1.8 శాతానికి తగ్గించామని, తాజాగా దానిని మైనస్ 5 శాతంగా అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ తెలిపింది. వ్యవసాయేతర జీడీపీ 6 శాతం తగ్గవచ్చునని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌కు కొంతలో కొంత సానుకూల అంశం ఏమంటే సాధారణ వర్షాలతో వరుణుడు సకాలంలో కరుణించే అవకాశం ఉండటమేనని తెలిపింది. వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి 2.5 శాతం పెరగడం ద్వారా కరోనా దెబ్బను కొంతలో కొంత తగ్గించవచ్చునని తెలిపింది.

ప్రభుత్వం రూ.21 లక్షల ప్యాకేజీపై...
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20.9 లక్షల కోట్ల ప్యాకేజీపై కూడా క్రిసిల్ స్పందించింది. ప్యాకేజీలో సంస్కరణలపై దృష్టి సారించినట్లు కనిపించిందని పేర్కొంది. ఇవి మిడ్ టర్మ్‌లో బాగా ప్రభావం చూపుతాయని, ఈ ప్యాకేజీ ద్వారా జీడీపీలో 1.2 శాతం మేర మాత్రమే నేరుగా ఖర్చు పెడుతున్నారని తెలిపింది. ఇది తమ అంచనాల కంటే తక్కువ అని పేర్కొంది.

ఫిచ్ రేటింగ్ కూడా..
మరో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును మైనస్ 5 శాతంగా ఉంటుందని పేర్కొంది. లాక్ డౌన్ పరిస్థితులకు తోడు ఆర్థిక కార్యకలాపులు మందగించడం ఇందుకు కారణమని తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications