2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి క్వార్టర్ (ఏప్రిల్-జూన్) వృద్ధి రేటు 15 శాతం నుండి 25 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 1996లో క్వార్టర్లీ జీడీపీ ప్రారంభమైనప్పటి నుండి ఇది వరస్ట్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. కరోనా కారణంగా ప్రపంచ జీడీపీతో పాటు భారత్ వృద్ధి రేటు కూడా భారీగా పడిపోనుంది. ఇంటర్నేషనల్ మానటరీ ఫండ్ ప్రకారం గ్లోబల్ వృద్ధి 2020లో 4.9 శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుంది.
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ జూన్ త్రైమాసికంలో 21.7 శాతం పడిపోతుందని ఐఎంఎఫ్ నివేదించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదయింది. 2012-13 నుండి ఇది కనిష్టం. ఇప్పుడు ఏకంగా ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

కరోనా మహమ్మారి, లాక్ డౌన్‌తో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఇప్పటికే డిమాండ్, వినియోగం, పెట్టుబడులు క్షీణించాయి. దీనికి తోడు రికార్డ్ క్వార్టర్ ప్రతికూలత నమోదు కావొచ్చునని సర్వే వెల్లడిస్తోంది. ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జీడీపీ జూన్ క్వార్టర్‌లో 18.3 శాతం మేర క్షీణిస్తుందని రాయిటర్స్ పోల్‌లో ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
అంతకుముందు క్వార్టర్‌లో 3.1 శాతం వృద్ధి రేటు నమోదయింది. ఈసారి 18.3 శాతం ప్రతికూలత ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. గత ఎనిమిదేళ్లలో అత్యంత వరస్ట్ రికార్డ్ ఇదే అవుతుంది. అదే సమయంలో రానున్న సెప్టెంబర్ క్వార్టర్‌లో 8.1 శాతం ప్రతికూలత, డిసెంబర్ త్రైమాసికంలో 1 శాతం ప్రతికూలతను అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలను చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రికవరీ దారుణంగా ఉంటుందని భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications