కరోనా మహమ్మారి కారణంగా స్థూల దేశీయోత్పత్తి(GDP) ఊహించని విధంగా కుదేలైంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో జీడీపీ 23.9% క్షీణించింది. ఇప్పటివరకు ఇదే భారీ పతనం. అప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే కరోనా దెబ్బ తగిలింది. కరోనా కారణంగా ప్రజల ప్రాణాల కోసం లాక్ డౌన్ అనివార్యంగా మారింది. కానీ దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో జీడీపీ 5.2% పెరిగింది. ఈసారి కరోనా దెబ్బతో కనీవినీ ఎరుగని విధంగా ప్రతికూలత నమోదు చేసింది.

జీడీపీ అంటే ఏమిటి?
జీడీపీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు? అనే అంశాలు తెలుసుకుందాం. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక నిర్దిష్ట కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం వ్యాల్యూను స్థూల జాతియోత్పత్తి(GDP) అంటారు.
గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భారత్‌లో ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సేవల మొత్తం విలువతో ఈ ఏడాది అదే కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సేవలను పోల్చుతారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో జీడీపీ 23.9 శాతం క్షీణించడం అంటే గత ఏడాది ఇదే కాలం కంటే ఆ మేరకు తక్కువ అని అర్థం.

ఎవరు లెక్కిస్తారు?
సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్(CSO) ప్రతి ఏడాది నాలుగుసార్లు జీడీపీని లెక్కిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి లెక్కించే ఈ గణాంకాలను ఆర్థిక పరిభాషలో త్రైమాసిక గణాంకాలు అంటారు. నాలుగు త్రైమాసికాలతో పాటు ప్రతి సంవత్సరం వార్షిక జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా విడుదల చేస్తుంది CSO. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ప్రతి ఏటా అధిక జీడీపీ కీలకం. సరళీకృత ఆర్థిక విధానాల అనంతరం భారత జీడీపీ 7 శాతం నుండి మధ్యలో 1 శాతానికి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల 8 శాతానికి చేరుకుంది. అయితే గత ఏడాది మందగమనం, ఇప్పుడు కరోనా కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 7 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా. 1990లలో ఆర్థిక సరళీకరణల అనంతరం సగటున 7 శాతం మేర వృద్ధి సాధించింది.

జీడీపీని ఎలా లెక్కిస్తారు?
సిమెంట్, బొగ్గు, స్టీల్, టెలిఫోన్, కమర్షియల్ వెహికిల్ సేల్స్, మేజర్ సీపోర్ట్స్, విమనానాశ్రయాలు, రైల్వే తదితర ఉత్పత్తులు, సేవలు కీలకం. ఇక జీడీపీని లెక్కించడానికి నాలుగు విస్తృత అంశాలు కూడాలి. 1.వినిమయ వ్యయం అంటే దేశ జనాభా వస్తువులు, సేవలను కొనుగోలు చేసేందుకు చేసిన మొత్తం ఖర్చు, 2.ప్రభుత్వ వ్యయం, 3.పెట్టుబడి వ్యయం, 4.నికర ఎగుమతుల వ్యాల్యూ. జీడీపీని నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ అని రెండు రకాలుగా లెక్కిస్తారు.
నామినల్ జీడీపీలో అన్ని వస్తువులు, సేవల వ్యాల్యూను ప్రస్తుత ధరలతో (జీడీపీని లెక్కించిన సంవత్సరపు ధరలతో) లెక్కిస్తారు. బేస్ ఇయర్ ప్రకారం ద్రవ్యోల్భణాన్ని సవరించినప్పుడు రియల్ జీడీపీ వస్తుంది.

జీడీపీ గణాంకాల సేకరణ
జీడీపీ గణాంకాలను ప్రధాన రంగాల నుండి సేకరిస్తారు. వ్యవసాయం, తయారీ, విద్యుత్, గ్యాస్, గనులు, అడవులు, చేపల వేట, హోటల్, నిర్మాణం, వాణిజ్యం, సమాచార సంబంధాలు, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఇన్సురెన్స్, వాణిజ్య సేవలు వంటి వివిధ రంగాల నుండి సేకరిస్తారు.
ఉదాహరణకు బొగ్గు ఉత్పత్తి 2019-20లో 2.6 శాతం వృద్ధి సాధించగా, ఈసారి మైనస్ 15 శాతానికి, స్టీల్ వినియోగం క్రితంసారి 5 శాతం వృద్ధి సాధించగా, ఈసారి మైనస్ 56.8 శాతానికి, సిమెంట్ ఉత్పత్తి క్రితం సారి 1 శాతం ఉండగా, ఈసారి మైనస్ 38.3 శాతానికి, టెలిఫోన్ సబ్‌స్క్రైబర్లు క్రితం సంవత్సరం 1.5 శాతం వృద్ధి సాధఇంచగా, ఈసారి మైనస్ 2 శాతం, కమర్షియల్ వెహికిల్ సేల్స్ క్రితం సారి మైనస్ 9.5 శాతం కాగా, ఈసారి మైనస్ 84.8 శాతం నమోదయింది. మేజర్ సీపోర్ట్స్, కార్గో ఎయిర్ పోర్ట్స్, పాసింజర్ ఎయిర్ పోర్ట్స్ (మైనస్ 0.6 శాతం నుండి ఏకంగా మైనస్ 94.1 శాతానికి పడిపోయింది) వంటివి కూడా దారుణంగా పడిపోయాయి.

అసంఘటిత రంగం ప్రతిఫలించదు
జీడీపీ వృద్ధి చెందుతుందంటే ఆర్థిక కార్యకలాపాల విషయంలో దేశానికి డోకా లేదని అర్థం. జీడీపీ నిరాశాజనకంగా ఉంటే పెట్టుబడులు తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ఇక్కడ మరో అంశం ఉంది. జీడీపీని లెక్కించేందుకు సంఘటిత రంగాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అసంఘటిత రంగంలోని పరిస్థితి జీడీపీ గణాంకాల్లో ప్రతిఫలించదు. దేశంలో ఎక్కువ శాతం ఉపాధి అసంఘటిత రంగంలోనే ఉంది. కరోనా కారణంగా సంఘటిత రంగాల కంటే అసంఘటిత రంగం ఎక్కువగా దెబ్బతిన్నది. జీడీపీ గణాంకాల్లో ఇది వెంటనే ప్రతిబింబించదు. కాబట్టి జీడీపీ వృద్ధి రేటు ఎంత క్షీణిస్తే అసంఘటిత రంగం లెక్కలోకి రానందున అంతకుమించి వృద్ధి క్షీణించినట్లే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications