IT News: ఆ ఐటీ కంపెనీల గ్యాలం.. ఉద్యోగంలో చేరే టెక్కీలకు రూ.43 లక్షల వరకు ఆఫర్..
IT Jobs: భారతదేశంలోని ఐటీ పరిశ్రమంలో ఉద్యోగులకు అందిస్తున్న వేతనాలపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇటీవల కాగ్నిజెంట్ ప్యాకేజీ గురించి పెద్ద వివాదం నడిచిన తర్వాత ఇతర టాప్ కంపెనీలకు సంబంధించిన వేతనాలపై కూడా వార్తలు వచ్చాయి.
అయితే మరోపక్క కొన్నేళ్లుగా విదేశీ కంపెనీలు భారత్‌లో తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను(GCC) ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. నైపుణ్యం కలిగిన కార్మికుల అధిక సామర్థ్యం కారణంగా విదేశీ కంపెనీలు తమ సాంకేతిక ప్రాజెక్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన IT సేవా సంస్థలకు అవుట్‌సోర్సింగ్ చేయడం కంటే వారి సొంత కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా తమ సాంకేతిక సేవలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాయి. దీంతో క్రిటికల్ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరగడమే కాకుండా జీతాలు ఊహించని స్థాయిల్లో పెరిగిపోయాయి.

టీమ్‌లీజ్ డిజిటల్ అధ్యయనం ప్రకారం దేశీయ టెక్ కంపెనీలైన విప్రో, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రాల కంటే జీసీసీ కంపెనీలు అధిక వేతనాలను అందిస్తున్నాయని వెల్లడైంది. ఇవి రెగ్యులర్ ఐటీ సర్వీస్ కంపెనీల కంటే అన్ని స్థాయిల్లో కీలకమైన టెక్నికల్ ఉద్యోగాలకు కనీసం 12-20 శాతం ఎక్కువ జీతాలు అందిస్తున్నాయి.
ఈ ఫారెన్ సంస్థలు సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాలకు రూ.9.7 లక్షల నుంచి రూ.43 లక్షలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇది టెక్కీల అనుభవంతో పాటు ఇతర అంశాల ఆధారంగా జరుగుతోంది. ఇక్కడ సాధారణ ఐటీ సేవల కంపెనీ కంటే ఎక్కువ నైపుణ్యాలు అవసరం ఉంటుంది అందుకే దానికి తగినట్లుగా వేతనాలు అందించటం జరుగుతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో 1,600 జీసీసీ కంపెనీలు ఇప్పటికే 16.6 లక్షల మందికి పైగా IT సిబ్బందిని కలిగి ఉన్నాయి. మరో 800 కొత్త జీసీసీ కంపెనీలు వచ్చే ఐదు-ఆరేళ్లలో ఏర్పాటు కానున్నాయి. ప్రధానంగా దేశంలోని ద్వితీయశ్రేణి నగరాలపై ఈ సంస్థలు కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాయి. ఈ కంపెనీల్లో PyTorch, AWS, DevOps, NLP, Kubernetes, Hyperledger Fabric, Blockchain, Tableau, SQL, ServiceNow వంటి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. FY 2024 నాటికి భారతదేశ సాంకేతిక మార్కెట్ విలువ 254 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.


Click it and Unblock the Notifications