న్యూఢిల్లీ: బిహార్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం గయా. పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. గయాసురుడి పేరు మీద నిర్మితమైన నగరం ఇది. పరమ పవిత్రమైన విష్ణుపాద ఆలయం ఉన్నది ఇక్కడే. శ్రీమన్నారాయణుడు స్వయంగా కాలు మోపిన ప్రాంతంగా ప్రఖ్యాతి చెందింది. ఈ నగరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే- వారికి మోక్షప్రాప్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. గౌతముడు జ్ఞానోదయాన్ని పొందిన బుద్ధ గయా, నలంద, వైశాలి వంటి చారిత్రక ప్రదేశాలు ఈ నగరానికి సమీపంలోనే ఉన్నాయి.

అంతర్జాతీయ విమానాశ్రయం..
అందుకే- ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు గయాను సందర్శిస్తుంటారు. బౌద్ధమతాన్ని అనుసరించే థాయ్‌లాండ్, కాంబోడియా, మయన్మార్ వంటి దేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం గయాలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. దశాబ్ద కాలంగా కార్యకలాపాలను సాగిస్తోన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు తాజాగా వివాదాస్పదమైంది.

గే కోడ్..
దీనికి కారణం- ఈ విమానాశ్రయానికి కేటాయించిన కోడ్. ఆ కోడ్ పేరు గే (Gay). గే అనేది హోమో సెక్సువల్స్‌ను ప్రతిబింబించే పేరు. ఈ కోడ్‌ను గయా అంతర్జాతీయ విమానాశ్రయానికి కేటాయించడం పట్ల దుమారం చెలరేగుతోంది. దీన్ని మార్చాలనే డిమాండ్ చాలాకాలం నుంచి వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ కేటాయించిన కోడ్ ఇది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తుంటుంది.

కోడ్ పట్ల అభ్యంతరం..
టికెట్లను బుక్ చేసుకోవాల్సిన సమయంలో ఎయిర్‌పోర్ట్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకే- ప్రతి విమానాశ్రయానికి కూడా ఓ కోడ్‌ను కేటాయిస్తుంటుంది ఐఏటీఏ. గయా విమానాశ్రయానికి గే అనే కోడ్‌ను కేటాయించింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌కు ఇలాంటి అసభ్యకరమైన కోడ్‌ను కేటాయించడం పట్ల ప్రయాణికుల నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని మార్చాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.

పౌర విమానయాన శాఖే..
పౌర విమానాయాన కార్యకలాపాలపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్.. తొలిసారిగా గత సంవత్సరమే ఈ కోడ్‌ను మార్చాలంటూ సిఫారసు చేసింది. ఇప్పటికీ ఆ కోడ్ అలాగే కొనసాగుతోంది. ఇదే విషయాన్ని పార్లమెంటరీ ప్యానెల్.. తాజాగా మళ్లీ లేవనెత్తింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తింది. ఐఏటీఏ వివరణ కోరింది.
తాము కోడ్‌ను మార్చలేమని ఐఏటీఏ అధికారులు చేతులెత్తేశారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications