Adani: బిలియనీర్ గౌతమ్ అదానీ తన మంచి మనసును చాటుకున్నారు. గత నెలలో నేపాల్ లోని అన్నపూర్ణ పర్వతం వద్ద లోతైన పగుళ్లలో పడి రక్షించబడిన పర్వతారోహకుడు అనురాగ్ మాలూను ఆసుపత్రికి తరలించడంలో సాయం అందించారు. ఖాట్మండు నుండి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు అతడిని తీసుకువెళ్లడానికి సహాయంగా ఎయిర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు.
అదానీ చేసిన సాయానికి గాను అనురాగ్ మాలూ సోదరుడు ఆశిష్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. గాయపడిన వారిని సకాలంలో విమానంలో తరలించడంపై భావోద్వేగ పోస్ట్ చేశారు. "సకాలంలో ఎయిర్‌లిఫ్టింగ్ చేసినందుకు మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతలు! @AnuragMalooని సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో అమూల్యమైన సహకారం అందించిన @gautam_adani మరియు @AdaniFoundationకి హృదయపూర్వక ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు.

గాయపడిన అనురాగ్ మాలూ రాజస్థాన్‌లోని కిషన్ గఢ్ నివాసి. ఏప్రిల్ 17న అన్నపూర్ణ పర్వతంపై క్యాంప్ III నుంచి దిగుతుండగా 5 వేల 800 మీటర్ల ఎత్తు నుండి పడిపోయి అదృశ్యమయ్యాడు. మూడు రోజుల పాటు హిమపాతానికి గురై పగుళ్లలో ఉండి బయటపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండగా.. మొదట సమీప వైద్య శిబిరానికి, తరువాత పోఖారాలోని మణిపాల్ ఆసుపత్రికి , ఖాట్మండులోని మెడిసిటీ హాస్పిటల్ కు తరలించారు.
ఇది ప్రపంచంలోని 10వ ఎత్తైన పర్వతం, ఇది ప్రమాదకరమైన భూభాగానికి ప్రసిద్ధి చెందింది.
నేపాల్ నుంచి ఇండియాకు ఎయిర్ లిఫ్ట్ చేయడం మరియు గ్రౌండ్ ట్రాన్స్ఫర్ కు అయ్యే ఖర్చు తమ శక్తికి మించినదిగా అనురాగ్ కుటుంబం భావించింది. ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా అతని కుటుంబం అదానీ ఫౌండేషన్ ను అభ్యర్థించింది. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆయన దాతృత్వ విభాగం అదానీ ఫౌండేషన్ తరఫున ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అతడు న్యూఢిల్లీలోని AIMSలో చికిత్స పొందుతున్నాడు.
ఆశిష్ ట్వీట్ కు గౌతమ్ అదానీ రిప్లై ఇచ్చారు. "ప్రీతి మరియు నేను సహాయం చేయడం విశేషం. అనురాగ్ క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాము. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. త్వరలో మరిన్ని జీవిత శిఖరాలను జయించటానికి సిద్ధంగా ఉంటాడని విశ్వసిస్తున్నాము" అని ట్వీట్ చేశారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications