Raymond News: తేలనున్న గౌతమ్ సింఘానియా భవితవ్యం.. రేమండ్ ఇన్వెస్టర్లకు IIAS కీలక సూచనలు
Gautam Singhania: దేశం గర్వించదగ్గ ప్రముఖ టెక్స్‌టైల్ మరియు ఫ్యాబ్రిక్ తయారీదారుగా రేమండ్ కొనసాగుతోంది. దాన్ని ఆ స్థాయిలో నిలిపడంలో గౌతమ్ సింఘానియా కృషి కూడా ఎంతో ఉంది. అయితే ఇటీవల తన భార్యతో విడాకులు సహా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా ఆయన భవితవ్యం ఇవాళ తేలనుంది.
రేమండ్ లిమిటెడ్ తన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని(AGM) జూన్ 27న నిర్వహిస్తోంది. కంపెనీ బోర్డులో ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా గౌతమ్ సింఘానియా పునః నియామక ప్రతిపాదనను AGM పరిశీలించనుంది. ఆయన పదవీకాలం జూలై 1, 2024 నుంచి జూన్ 30, 2029 వరకు ఐదేళ్ల పాటు కొనసాగేందుకు ఆమోదముద్ర పడనుంది. అలాగే CMD హోదాలో తదుపరి 3 సంవత్సరాలకుగాను జీతభత్యాలపై కూడా క్లారిటీ రానుంది.

ఈ సమయంలో ప్రాక్సీ ఎడ్వైజరీ సంస్థ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (IiAS) కీలక సూచనలు చేసింది. కంపెనీ బోర్డులో గౌతమ్ సింఘానియాను తిరిగి నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేయాలని రేమండ్ వాటాదారులకు పిలుపునిచ్చింది. గృహ హింసతో పాటు ఆయన మాజీ భార్య నవాజ్ మోడీ ద్వారా కంపెనీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని కోరింది.
అంతటితో ఆగకుండా విడాకుల సమస్యలు మరియు స్వతంత్ర దర్యాప్తు నివేదిక వచ్చే వరకు గౌతమ్ సింఘానియా సహా నవాజ్ మోడీలు రేమండ్ బోర్డు నుంచి వైదొలగాలని కూడా పిలుపునిచ్చింది. రెగ్యులేటరీ థ్రెషోల్డ్‌ల కంటే ఎక్కువ జీతభత్యాల చెల్లింపునకు అనుమతించకూడదని, ప్రతిపాదిత వేతన నిర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వాటాదారులకు సిఫార్సు చేసింది.


Click it and Unblock the Notifications