Raymond News: గౌతమ్ సింఘానియాని నమ్మి మోసపోయానన్న తండ్రి..! ఇప్పుడు భార్య కూడా
Raymond News: గత కొన్ని రోజులుగా గౌతమ్ సింఘానియా కుటుంబంలో జరుగుతున్న అనేక పరిణామాలు రేమాండ్ కంపెనీని పతనం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై మెున్న నవాజ్ మోదీ సింఘానియా స్పందించగా.. తాజాగా తండ్రి విజయపత్ సింఘానియా స్పందించారు.
తాను కొడుకును నమ్మి పూర్తిగా మోసపోయానని విజయపత్ సింఘానియా అన్నారు. 2015లో ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ గా తీర్చిదిద్దబడిన రేమాండ్ పగ్గాలను, పూర్తి బాధ్యతలను కుమారుడికి అందించటం తాను చేసిన పెద్ద తప్పని అన్నారు. పిల్లలకు ఆస్తులు అప్పగించే క్రమంలో తల్లిదండ్రులు ముందు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఆస్తులు పొందాక గౌతమ్ తన తండ్రిని దక్షిణ ముంబైలోని తన కుటుంబ ఆస్తి JK హౌస్ భవనం నుంచి వెళ్లగొట్టాడని విజయపత్ ఆరోపించారు.

ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయపత్.. ప్రస్తుతం తనకు ఎలాంటి వ్యాపారం లేదని, కంపెనీలో కొన్ని భాగాలను ఇస్తాన్న గౌతమ్ దానిని వెనక్కి తీసుకున్నాడని చెప్పారు. అయితే తనవద్ద ఉన్న మిగిలిన సొమ్ముతో ప్రస్తుతం జీవిస్తున్నానని చెప్పారు. అందుకే ప్రస్తుతం తాను ఇంకా బతకగలిగానని లేకుంటే కొడుకు గౌతమ్ సింఘానియాను నమ్ముకుంటే రోడ్డున పడేవాడినని చెప్పారు. తాజాగా విడాకులపై స్పందిస్తూ నవాజ్ డిమాండ్ చేసినట్లుగా ఆమెకు గౌతమ్ 75 శాతం పరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించడని చెప్పారు. అయితే హిందు చట్ట ప్రకారం భర్త ఆస్థితో 50 శాతం వస్తుందని అన్నారు.
తాజాగా గౌతమ్-నవాజ్ మోదీ మధ్య సెప్టెంబరులో వివాదం వచ్చింది. వాస్తవానికి ఒక బాత్ రూమ్ విషయంలో కుమార్తె, భార్యలపై సింఘానియా చేయి చేసుకున్నాడు. వారిని విచక్షణా రహితంగా కొట్టినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో తమను తాము కాపాడుకునేందుకు నీతా అంబానీ, అనంత్ అంబానీల సహాయం తీసుకున్నట్లు నవాజ్ మోదీ తెలిపారు.


Click it and Unblock the Notifications