ITD Cementation News: భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీగా దానికోసం డబ్బును సైతం కేటాయించింది. దీంతో వస్తున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని భారతీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. దీనికి అనుగుణంగా గౌతమ్ అదానీ అనేక కొత్త కంపెనీలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ కంపెనీ అయిన రెన్యూ ఎగ్జిమ్ డీఎంసీసీ తాజాగా ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో కీలక వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఐటీడీ సిమెంటేషన్ ఇండియాలో 46.64 శాతం వాటాను దాని ప్రమోటర్ల నుంచి రూ.3,204 కోట్లకు ఒక్కో షేరుకు రూ.400 చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్‌లో కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం వెల్లడైంది. ఇదే క్రమంలో ఐటీడీ సిమెంటేషన్ పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి అదానీ గ్రూప్ ఒక్కో షేరుకు రూ.571.68 చొప్పున కొనుగోలుతో మరో 26 శాతం వాటాను పొందాలని చూస్తోంది. దీనికోసం రూ.2553 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.

ఐటీడీ సిమెంటేషన్ ప్రమోటర్ ఇటాలియన్-థాయ్ డెవలప్‌మెంట్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ జూలై 2024లో సివిల్ ఇంజినీరింగ్ కంపెనీలో తన వాటాను విక్రయించడానికి అన్వేషిస్తున్నట్లు తెలిపింది. దీని తర్వాత అదానీ గ్రూప్ దేశంలో ఎయిర్‌పోర్ట్‌లు, హైవేలు, మెట్రో ప్రాజెక్ట్‌ల వంటి రంగాల్లో సివిల్ ఇంజనీరింగ్ సామర్థ్యాలను పెంచడానికి తాజా కొనుగోలు డీల్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇది అదానీ గ్రూప్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఐటీడీ సిమెంటేషన్ మెట్రో వ్యవస్థలు, సముద్ర నిర్మాణాలు, స్పీడ్ హైవే వ్యవస్థలు, విమానాశ్రయాలు, జల-విద్యుత్ శక్తి, సొరంగాలు, డ్యామ్స్ & నీటిపారుదల, హైవేలు, వంతెనలు & ఫ్లైఓవర్‌లు, పారిశ్రామిక నిర్మాణాలు వంటి ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ ప్రాజెక్టుల్లో ప్రత్యేకత కలిగి ఉంది.
2024 ఆర్థిక సంవత్సరంలో ఐటీడీ సిమెంటేషన్ ఆదాయం రూ.7,542 కోట్లుగా ఉండగా కంపెనీ లాభం రూ.274 కోట్లు వద్ద నమోదైంది. ఏడాది కాలంలో ఐటీడీ సిమెంటేషన్ షేర్ల ధరలు 180 శాతానికి పైగా పెరిగాయి. అలాగే గడచిన 6 నెలల్లో షేర్ల ధరలు 44% పెరుగుదలను చూసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,152.84 కోట్లుగా ఉంది. ప్రస్తుతం అదానీకి చెందిన రెన్యూ ఎగ్జిమ్ పోర్ట్‌ఫోలియోలో దిల్లీ మెట్రో, కోల్‌కతా మెట్రో పనులు ఉండటంతో తాజా డీల్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదానీ వ్యూహాత్మకంగా కుదుర్చుకున్న డీల్ అని అర్థం చేసుకోవచ్చు.
దీనికి ముందు అదానీ గ్రూప్ గడచిన వారంలో సిమెంట్ వ్యాపారాన్ని విస్తరించేందుకు సికె బిర్లాకు చెందిన ఓరియంట్ సిమెంట్ కంపెనీలో వాటాలను దక్కించుకునేందుకు రూ.8100 కోట్లు వెచ్చించింది. ఈ డీల్ అంబుజా సిమెంట్స్ ద్వారా నిర్వహించబడుతోంది. దీని ద్వారా ప్రస్తుత ప్రమోటర్లు, పబ్లిష్ వాటాదారుల నుంచి ఓరియంట్ సిమెంట్ కంపెనీకి చెందిన 46.8 శాతం వాటాలను అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. దీనిని పూర్తిగా అంతర్గత నిధుల ద్వారా చేపడుతోంది. దేశంలో తొలి స్థానంలో నిలిచిన బిర్లాలకు చెందిన అల్ట్రాటెక్ సిమెంటును వెనక్కి నెట్టేందుకు అదానీ వేగంగా కొత్తకంపెనీల్లో వాటాలు కొంటూ మార్కెట్ షేర్ విస్తరించే పనిలో కొన్ని నెలలుగా కొనసాగుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications