Gautam Adani: సుప్రీం కోర్టు తీర్పుపై కీలక కామెంట్స్ చేసిన గౌతమ్ అదానీ..!
Adani on Verdict: అదానీ-హిండెన్ బర్గ్ కేసు విచారణను సెబీ నుంచి సీబీఐకి మార్చాలంటూ సుప్రీం ధర్మాసం నేడు కీలక తీర్పు వెలువరించింది. గత ఏడాది జనవరి నుంచి పెద్ద సంచలనంగా మారిన వ్యవహారికి నేడు తెరపడింది.
సెబీ అధికార పరిధిని సుప్రీం కోర్టు ధర్మాసనం పూర్తిగా సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు కొనసాగుతున్న విచారణపై ప్రభావం చూపే కీలక అంశాలు, ఆదేశాలను స్పష్టం చేసింది. అలాగే వార్తా పత్రికలు, థర్డ్ పార్టీ సంస్థల నివేదికలపై ఆధారపడటాన్ని, వారి వ్యాఖ్యలను రుజువుగా పరిగణించబడవని వెల్లడించింది.

సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు అదానీ గ్రూప్ కంపెనీలకు అతిపెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు. దీనిని స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లతో పాటు గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సైతం ఆహ్వానించారు. దీనిపై ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. నేడు సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పుతో నిజం గెలిచిందని.. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అదానీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ వృద్ధి కథనానికి తమ వినయపూర్వకమైన సహకారం కొనసాగుతుందంటూ అందులో పేర్కొన్నారు.
కొందరు సామాన్యులు అదానీ ట్వీట్ కు సానుకూలంగా స్పందిస్తూ తాము అండగా నిలుస్తామని చెబుతుండగా మరికొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. రాన్ బామన్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తూ అనుకూలంగా ఈ తీర్పును అందించినందకు సుప్రీం కోర్టు ఎంత ప్రతిఫలంగా అడిగింది? అంటూ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications