అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అతని సంపద 118 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదానీ ఏప్రిల్ 4వ తేదీన 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. తద్వారా టాప్ 10 గ్లోబల్ బిలియనీర్స్ జాబితాలోకి వచ్చారు. 59 ఏళ్ల ఈ సెంటీ బిలియనీర్ ఇప్పుడు 100 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వంటి వారి పక్కన చేరారు.
ఇటీవలి వరకు ఆసియా, భారత్ కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు. ఇప్పుడు గౌతమ్ అదానీ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 118 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ 6వ స్థానంలో ఉండగా, ముఖేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. తద్వారా ఆసియా కుబేరుడిగా నిలిచారు. అదానీ సంపద మన కరెన్సీలో రూ.9 లక్షల కోట్లు.

వారంలోనే 18 బిలియన్ డాలర్లు పెరగడంతో గూగుల్ వ్యవస్థాపకులు లారీపేజ్, సర్గే బ్రిన్‌లను కూడా దాటేశారు అదానీ. ఈ క్రమంలో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలవడమేగాక, టాప్-10లో ఉన్న ఏకైక భారతీయుడిగా నిలిచారు. ఏడాది క్రితం కేవలం 57 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్న అదానీ ఈ నెల 4న 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి తొలిసారిగా ప్రవేశించారు. దీంతో ముకేశ్ అంబానీని కూడా వెనక్కినెట్టారు.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications