Gautam Adani: అదానీ సంచలన నిర్ణయం.. సిమెంట్ కంపెనీల్లో వాటాల విక్రయం..
Gautam Adani: దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ తన వ్యాపారాలను కడిగిన ముత్యంలా తయారు చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సిమెంట్ కంపెనీల్లో వేల కోట్లు విలువైన వాటాలను విక్రయించాలని నిర్ణయించారు.

సిమెంట్ వ్యాపారాలు..
అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ కంపెనీపై రుణాల భారాన్ని తగ్గించాలని ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆయన ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో సిమెంట్ వ్యాపారంలో వాటాలను 450 మిలియన్ డాలర్లకు విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు అదానీ భారీ రుణాలను ముందస్తుగా చెల్లించి ఇన్వెస్టర్లలో ఆందోళనలను పోగొట్టారు.

ప్లాన్ ఏమిటంటే..
అదానీ అంబుజా సిమెంట్‌లో 4-5 శాతం వాటాను అంతర్జాతీయ రుణదాతలకు విక్రయించాలని చూస్తున్నట్లు సమాచారం. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల నుంచి గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి రుణాలను తగ్గించటంలో భాగంగా ఈ నిర్ణయం జరిగిందని తెలుస్తోంది.

గతవారం చెల్లింపులు..
మార్చి 9న చెల్లించాల్సిన 500 మిలియన్ డాలర్లు బ్రిడ్జి రుణాన్ని అదానీ గ్రూప్ తిరిగి చెల్లించిందని బ్లూమ్‌బెర్గ్ ఒక వార్తా కథనంలో వెల్లడించింది. ఇదే క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన మరిన్ని షేర్లు తాకట్టులోనే ఉన్నాయని ఎస్‌బీఐకాప్ ట్రస్టీ బుధవారం వెల్లడించింది. వీరి వివరాల ప్రకారం అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లోని 0.99% షేర్లను అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ "రుణదాతల ప్రయోజనాల కోసం" తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications