Gautam Adani: దేశంలోనే కాక ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన అదానీ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. గుజరాత్ లో జన్మించిన అదానీ.. అహ్మదాబాద్‌లోని CN విద్యాలయ వాణిజ్య విభాగం నుంచి చదువు మధ్యలోనే ముగించాడు. అలా ముంబైలోని వజ్రాల వ్యాపారంపై ప్రీతితో 3 ఏళ్ల పాటు అక్కడే పని నేర్చుకున్నాడు.

పోర్టులపై పిచ్చి..
చదువుకునే రోజుల్లో అదానీ ఒకసారి గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవును సందర్శించాడు. తనకు కూడా జీవితంలో ఇలాంటి పెద్ద పోర్టు ఉంటే బాగుంటుంది అని ఆశపడ్డాడు. అయితే 1995లో అదానీ తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. ఎలాగంటే.. గుజరాత్‌లోని ముంద్రా పోర్టును ప్రైవేటీకరించే కాంట్రాక్టును 1995లో అదానీ గ్రూప్ గెలుచుకుంది. గౌతమ్ దీన్ని దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్టుగా అభివృద్ధి చేశారు.

సెల్ఫ్ మేడ్ మిలియనీర్..
గౌతమ్ అదానీ ఒక బట్టల వ్యాపారి కుటుంబంలో జన్మించారు. అయితే అతనికి కుటుంబ వ్యాపారంపై పెద్దగా మక్కువ లేదు. అయితే వజ్రాల వ్యాపారంపై మక్కువతో ముంబై చేరుకున్న అతడు తన 20 ఏళ్ల వయస్సులోనే స్వయంగా కోటీశ్వరుడిగా మారాడు. డైమండ్ బ్రోకర్ గా వృత్తిని ప్రారంభించి మెుదటగా కోటీశ్వరుడయ్యాడు. బేరసారాలు ఆడటంతో దిట్ట అయిన అదానీ.. కేవలం 100 గంటల చర్చల్లో ఉడిపి థర్మల్ పవర్ ప్లాంట్‌ను రూ.6,000 కోట్లకు దక్కించుకున్నాడు.

అదానీ ఫౌండేషన్..
దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు విద్యుత్ తయారీదారుగా ఉన్న అదానీ గ్రూప్ సామాజిక కార్యక్రమాల్లో సైతం పాల్గొంటోంది. అలా దేశంలోనే అతిపెద్ సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా ఉన్న అదానీ తన వెంటర్స్ ద్వారా వచ్చే లాభంలో 3 శాతాన్ని అదానీ ఫౌండేషన్ ను నడిపేందుకు వినియోగిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని అదానీ విద్యా మందిర్ స్కూల్.. తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తుంది. దీనికి తోడు తన 60వ పుట్టిన రోజు సందర్భంగా అదానీ కుటుంబం దేశంలోని విద్య, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.60,000 కోట్లను వెచ్చించటానికి ముందుకొస్తున్నట్లు ప్రకటించింది.

భయపడిన అదానీ..
ఇంత బడా వ్యాపారవేత్త అయిన అదానీ ఒకసారి తన జీవితంలో కేవలం 15 అడుగుల దూరం నుంచి మరణాన్ని చూసినట్లు వెల్లడించారు. ఈ వ్యాపారవేత్త మెుదటి సారి 1997లో కిడ్నాప్ నుంచి బయటపడగా.. రెండవ సారి 2008లో మరణాన్ని చాలా దగ్గరగా చూశారు. ముంబయి నగరంలోని తాజ్ హోటల్ ఉగ్రవాదాలు దాడి చేసిన సమయంలో.. ఆయన కూడా హోటల్లో విందు చేస్తున్నారు. కమాండోలు చివరికి హోటల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత దిగ్గజ వ్యాపారవేత్త ప్రాణాలతో బయటకు తప్పించుకోగలిగారు. ఆ సమయంలో మరణాన్ని 15 అడుగుల సమీపం నుంచి చూసినట్లు ఆయన వెల్లడించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications