Adani Copper: రాగి ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభిస్తున్న అదానీ.. ఎప్పుడు..? ఎక్కడ..?
Adani News: అదానీ గతంలో ప్రకటించిన కాపర్ ప్లాంట్ త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలు మెుదలెట్టేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అనేక రంగాల్లో ఉన్న అదానీ ఇకపై ఖనిజాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
గౌతమ్ అదానీ గ్రూప్‌కు చెందిన కాపర్ ప్లాంట్ కొత్త ఏడాదిలో ప్రారంభం కానుంది. ప్లాంట్ మార్చి 2024లో ఉత్పత్తిని ప్రారంభించనుందని సమాచారం. అదానీ ఎంట్రీతో దేశంలో కాపర్ ఉత్పత్తి భారీ పెరుగుదలను చూస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రూప్‌లోని ప్రముఖ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన కచ్ కాపర్ లిమిటెడ్(KCL) రెండు దశల్లో ఏడాదికి 1 మిలియన్ టన్నుల శుద్ధి చేసిన రాగిని ఉత్పత్తి చేయడానికి ఒక కాపర్ రిఫైనరీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

పనామాలోని ఒక ప్రధాన గని మూసివేయబడింది. ఆంగ్లో అమెరికన్ PLC యాజమాన్యంలోని కార్యకలాపాలు భారీగా తగ్గించబడ్డాయి. రాగిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని వేగంగా విస్తరించడంలో భారత్.. చైనా వంటి ఇతర దేశాలతో చేరింది. భారత రాగి సాంద్రత దిగుమతులు ఈ ఏడాది అంచనా వేసిన 1.3 మిలియన్ టన్నుల నుంచి 2024 నాటికి 2 మిలియన్ టన్నులకు పెరుగుతాయని ANZ బ్యాంకింగ్ గ్రూప్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ సోని కుమారి అన్నారు. 2025లో చైనా, భారత్‌లో స్మెల్టింగ్ సామర్థ్యాన్ని విస్తరించడం వల్ల మార్కెట్ మరింత పటిష్టంగా మారుతుందని అన్నారు.
భారత్ తన ఖనిజ అవసరాల్లో 90% కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. దేశంలోని అతిపెద్ద రాగి స్మెల్టర్‌ను ప్రస్తుతం హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. దీని సామర్థ్యం 5,00,000 టన్నులు. ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా ప్రకారం మార్చి 2023 వరకు ఉత్పత్తి 5,63,000 టన్నులు మాత్రమే కాగా.. వాస్తవ డిమాండ్ 1.5 మిలియన్ టన్నులుగా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications