For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gautam Adani: దాతృత్వంలో ముందున్న ఆ ముగ్గురు దిగ్గజాలు..ఎవరెవరంటే..

|

సంపాదనతో పాటు దానం చేయడంలో కూడా ముందున్నాడు వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ. ఆసియాలో దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేసే వారి జాబితాను తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసింది. బిలియనీర్లు గౌతమ్ అదానీ, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ శివ్ నాడార్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ అశోక్ దాత్వత్వపు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ఆసియా హీరోస్ ఆఫ్ ఫిలాంత్రోపీ జాబితా 16వ ఎడిషన్‌ మంగళవారం విడుదల చేసింది.

రూ. 60,000 కోట్లు

రూ. 60,000 కోట్లు

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ సంవత్సరం జూన్‌లో 60వ వడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. సమాజహిత కార్యక్రమాల కోసం రూ. 60,000 కోట్లు ($7.7 బిలియన్లు) ఖర్చు పెడతామని ప్రకటించారు. ఈ డబ్బు ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. 1996లో స్థాపించిన అదానీ ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

$1 బిలియన్

$1 బిలియన్

గౌతమ్ అదానీ భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ గా ఉన్నాడు. వస్తువులు, విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్, రియల్ ఎస్టేట్‌లో అదానీ గ్రూప్ ఉంది. అదానీ తర్వాత భారత్ నుంచి హెచ్ సీఎల్ టెక్ అధినేత శివ్ నాడార్ ఉన్నారు.. ఈయన భారతదేశంలోని అగ్ర దాతలలో ఒకరిగా ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా తన సంపదలో దాదాపు $1 బిలియన్లను శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు.

శివ్ నాడార్ ఫౌండేషన్‌

శివ్ నాడార్ ఫౌండేషన్‌

విద్య పేదవారిన శక్తివంతం ఉద్దేశంతో 1994లో శివ్ నాడార్ ఫౌండేషన్‌ స్థాపించారు. ఆయన ఈ సంవత్సరం అతను రూ.11,600 కోట్లు ($142 మిలియన్లు) విరాళంగా ఇచ్చాడు. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు అయిన నాడార్ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వంటి విద్యాసంస్థలను స్థాపించడంలో సహాయం చేశారు. ఫౌండేషన్ ట్రస్టీలలో అతని భార్య కిరణ్ నాడార్, కుమార్తె రోష్ణి నాడార్ మల్హోత్రా, అల్లుడు శిఖర్ మల్హోత్రా ఉన్నారు.

అశోక్ సూటా

అశోక్ సూటా

శివ్ నాడార్ తర్వాత అశోక్ సూటా ఉన్నారు. టెక్ టైకూన్ అశోక్ సూటా వృద్ధాప్యం, నరాల సంబంధిత వ్యాధుల అధ్యయనం కోసం ఏప్రిల్ 2021లో తాను స్థాపించిన మెడికల్ రీసెర్చ్ ట్రస్ట్‌కు రూ.600 కోట్లు (USD 75 మిలియన్లు) విరాళంగా ఇవ్వనున్నారు. ఆయన రూ.200 కోట్ల వ్యయంతో SKAN- వృద్ధాప్యం, నాడీ సంబంధిత వ్యాధులకు సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞాన సెంటర్ ను ప్రారంభించారు.

English summary

Gautam Adani: దాతృత్వంలో ముందున్న ఆ ముగ్గురు దిగ్గజాలు..ఎవరెవరంటే.. | Gautam Adani, Shiv Nadar and Ashok Soota have made it to India in the 16th edition of the Forbes Asia Heroes of Philanthropy list.

Gautam Adani, Shiv Nadar, Ashok Suta are leading in donation as well as earning. They are donating thousands of crores of rupees for welfare programs.
Story first published: Tuesday, December 6, 2022, 17:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X