Gautam Adani: ఒక్క మాటలో మ్యాటర్ తేల్చేసిన గౌతమ్ అదానీ.. నిజంగానే నిజమా..?
Gautam Adani: ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తాజాగా కంపెనీ వార్షిక నివేదికలో తన మనసులోని విషయాలను బయటపెట్టారు. కొత్త ఏడాది మనశాంతి లేకుండా గడిపుతున్న అదానీ ఇన్వెస్టర్లకు ఏం చెప్పారంటే..
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ ఉద్దేశపూర్వకంగా అదానీ గ్రూప్ కంపెనీల ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆరోపణలతో నివేదికను విడుదల చేశారని అన్నారు. ఇలా చేయటం వల్ల కంపెనీల షేర్లు తగ్గగా దాని ద్వారా లాభాలను పొందేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిందని అన్నారు. కావాలని టార్గెట్ చేసి తప్పుడు సమాచారాన్ని నివేదికగా ప్రచురించారని అన్నారు.

హిండెన్‌బర్గ్ విడుదల చేసిన సంచలన నివేదిక స్టాక్ మార్కెట్లలో పెద్ద సునామీని సృష్టించింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్‌లు వాటి విలువలో సగానికి పైగా నష్టపోయాయి. వీటిలో దెబ్బతిన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ క్రాష్ తర్వాత విజయవంతంగా పూర్తైన తన అతిపెద్ద ఆఫర్ ఫర్ సేల్ రూ.20,000 కోట్లను వెనక్కి తీసుకుని రద్దు చేసింది. ఇదే క్రమంలో అదానీ గ్రూప్ వివిధ ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చిందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.
ఈ వివాదం రాజకీయ రంగు పులుముకోవటంతో సుప్రీంకోర్టులో అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. విచారణ కోసం కమిటీ కూడా ఏర్పాటైంది. ప్రస్తుత మార్కెట్ నిబంధనలను అదానీ గ్రూప్ ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించలేదని ఆరుగురు సభ్యుల కమిటీ నివేదిక పేర్కొంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా ఈ సమస్యను పరిశీలించడానికి బాధ్యత వహించింది. అయితే నిపుణుల కమిటీ ఎటువంటి నియంత్రణ వైఫల్యాన్ని కనుగొనలేదని అదానీ పేర్కొన్నారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ ఏడాది ఆగస్టులో తన నివేదికను సమర్పించాలని చూస్తోంది. అక్కడ కూడా తమకు క్లీన్ చిట్ వస్తుందని అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పాలసీలు, నిర్వహణపై నమ్మకంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడిస్తూ.. హిండెన్‌బర్గ్ చర్య కుట్రపూరితమైనదిగా కొట్టిపారేశారు.
.


Click it and Unblock the Notifications