Gautam Adani: ఏళ్లుగా కట్టుకున్న గౌతమ్ అదానీ మహా వ్యాపార కోటకు హిండెన్‌బర్గ్ నివేదిక బీటలు వారేలా చేసింది. దీంతో అదానీ సైతం తన అతిపెద్ద ఆశయాలను ప్రస్తుతం వెనక్కి తీసుకున్నారు. ఇటీవల కొన్ని బిడ్డింగుల్లో అదానీ గ్రూప్ పాల్గొనక పోవటం, గతంలో చేసుకున్న కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవటం వంటి అంశాలు చూస్తే ఇదే అర్థమౌతోంది.
అదానీ గ్రూప్‌లో అనేక సంవత్సరాల పాటు జరిగిన కార్పొరేట్ మోసానికి సంబంధించిన హిండెన్‌బర్గ్ ఆరోపణలు జనవరి నుంచి మార్కెట్ విలువలో సుమారు 125 బిలియన్ డాలర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. రుణభారం గ్రూప్ పై అత్యధికంగా ఉందంటూ ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో పెట్రోకెమిక్ల్స్ వ్యాపారం నుంతి తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. పశ్చిమ భారతంలోని ముంద్రాలో 4 బిలియన్ డాలర్ల గ్రీన్‌ఫీల్డ్ కోల్-టు-పాలీ వినైల్ క్లోరైడ్ ప్రాజెక్ట్ విషయంలోనూ ముందుకు వెళ్లే అవకాశం లేదని కంపెనీ ఇటీవల పేర్కొంది. ఇతర కొత్త వ్యాపారాల విషయంలోనూ విస్తరణపై తిరిగి ఆలోచనలో పడిందని సమాచారం.

భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి భారత ప్రధాని నరేంద్ర మోదీకి దేశ నిర్మాణ ప్రయత్నాలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో అదానీ తన దృష్టిని ప్రధాన ప్రాజెక్టులపైకి మళ్లిస్తారని తెలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తి, ఓడరేవులు, న్యూ గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై ఎక్కువగా తమ దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పులను ముందుగా చెల్లించటం, షేర్లను తాకట్టు నుంటి విడిపించిన తర్వాత గ్రూప్ అధిక రిస్క్ ఫైనాన్సింగ్‌ను ముందుకు తీసుకెళ్లకూడదని భావిస్తోంది.
ఇలాంటి తరుణంలో అదానీ గ్రూప్ విదేశీ సంస్థల నుంచి నిధులను సమీకరించాలని చూస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగాగ అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్స్ BlackRock, Blackstone పసిఫిక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కో సహా US పెట్టుబడిదారులను కలిశారు. గ్రూప్ కంపెనీల్లో కొన్నింటికి ప్రైవేట్‌గా ఉంచిన బాండ్లను మార్కెట్ చేసే ప్రణాళికల్లో భాగంగా ఈ సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. ఈ రూపంలో దాదాపు 1 బిలియన్ డాలర్ల నిధులను రెండు విడతల్లో ఈ ఏడాది సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అంతర్గత వర్గాల ద్వారా వెల్లడైంది. ఈ సమావేశాలు ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపేందుకు నిర్వహిస్తున్న.. గ్లోబల్ రోడ్‌షోలో భాగంగా న్యూయార్క్, బోస్టన్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోతో సహా US నగరాలకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications