Adani News: ఆ కంపెనీలో మెజారిటీ వాటా విక్రయించే ఆలోచనలో గౌతమ్ అదానీ.. పూర్తి వివరాలు..
Adani News: గౌతమ్ అదానీ నేతృత్వంలోని కంపెనీలు ఇటీవల అనేక మార్పులకు లోనవుతున్నాయి. వ్యూహాత్మకంగా కొత్త వ్యాపారాల కొనుగోళ్లు, ఉన్న వ్యాపారాల్లో వాటాల విక్రయం వంటి అడుగులు వేస్తూ ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ విల్మార్ ఇంటర్నేషన్ వాటాలను విక్రయించాలని అన్వేషిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ కొన్ని నెలలుగా అదానీ విల్మార్‌లో తన 44% వాటాను సంభావ్య విక్రయాన్ని పరిశీలిస్తోంది. గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం వాటాల విక్రయం తర్వాత మైనారిటీ వాటాలను కలిగి ఉండొచ్చని వెల్లడించింది.

గతవారం జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన అదానీ విల్మార్ మెుదటి త్రైమాసికంలో నష్టాన్ని నివేదించింది. వంటనూనెల ధరలు తగ్గుదలతో కంపెనీ లాభదాయకత దెబ్బతింది. అలాగే అదానీ విల్మార్ షేర్లు ఈ సంవత్సరం దాదాపు 36% క్షీణించటంతో.. కంపెనీ విలువ సుమారు 6.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదానీ కంపెనీలపై అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ అదానీ విల్మార్ అత్యం వేగంగా వృద్దిచెందుతున్న ఎఫ్ఎమ్సీజీ కంపెనీ అంటూ నివేదికలో వెల్లడించింది.

1999లో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,000 మందికిపైగా డిస్టిబ్యూటర్లను కలిగి ఉంది. అలాగే కోటి మందికి పైగా దేశ ప్రజలకు కంపెనీ ఉత్పత్తులైన వంటనూనెలు, గోధుమ పిండి, బియ్యం, పప్పుధాన్యాలు, చక్కెర వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్ వంటి ప్రత్యర్థి కంపెనీలతో వ్యాపారంలో పోటీపడుతోంది. ప్రస్తుతం అదానీ విల్మార్ ఉత్పత్తులకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉన్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. వంటనూనెలు, ఇతర ఉత్పత్తుల డిస్ట్రిబ్యూషన్ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications