Adani News: రూ.80,000 కోట్ల భారీ చెక్ రెడీ చేస్తున్న గౌతమ్ అదానీ.. స్పెండింగ్ ప్లాన్ ఇదే..
Gautam Adani: దేశంలోని టాప్ వ్యాపార వేత్తల్లో ఒకరుగా ఉన్న గౌతమ్ అదానీ తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆయన వ్యాపారాలపై అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ వాటిని విజయవంతంగా డీల్ చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఆయన వ్యాపార తెగువకు ఫిదా అయిన అనేక మంది భారతీయ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ కంపెనీల్లో తమ పెట్టుబడులను సంక్షోభంలోనూ కొనసాగించటానికి కారణం ఇదే.
తాజాగా అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ అతిపెద్ద ప్లాన్ సిద్ధం చేస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యాపారాలపై రూ.80,000 కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోంది. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన మూలధన వ్యయంలో కొంత భాగం న్యూ ఎనర్జీ బిజినెసెస్ అండ్ ఎయిర్ పోర్ట్స్ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ షా తెలిపారు. ఇందులో మెజారిటీ వాటా 50,000 కోట్లు ఎయిర్ పోర్ట్స్ వ్యాపార మూలధన అవసరాలకు వెళుతుందని వెల్లడైంది.

అదానీ న్యూ ఇండస్ట్రీస్ సోలార్ మాడ్యూల్స్ సూర్యరశ్మిని విద్యుత్, హైడ్రోజన్ గా విభజిస్తుంది. దీని తర్వాత రోడ్లు, గంగా ఎక్స్‌ప్రెస్‌వే కారణంగా రూ.12,000 కోట్ల క్యాపెక్స్ వెచ్చిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ పీవీసీ ప్రాజెక్టుకు రూ.10,000 కోట్లు, మిగిలిన రూ.5,000 కోట్లను డేటా సెంటర్ల వ్యాపారానికి పెట్టుబడిగా వినియోగించాలని సూచ్సోంది. అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 10 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్‌తో పాటు 3 GW విండ్ టర్బైన్‌లను ఉత్పత్తి చేయడానికి ఫ్యాక్టరీలను లక్ష్యంగా చేసుకుంటోందని షా చెప్పారు.
అదానీ గ్రూప్ గుజరాత్‌లోని తన ఫ్యాక్టరీలో సౌర మాడ్యూల్స్ తయారీకి ఉపయోగించే వేఫర్స్ కడ్డీల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది 2027-28లో పాలీసిలికాన్‌ను తయారు చేసి భారతదేశపు మొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ ప్లేయర్‌గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రూప్ 2030 నాటికి 45 GW పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో మూడింట రెండు వంతులు గుజరాత్‌లోని ఖవ్దా పునరుత్పాదక ఇంధన పార్కులో ఉత్పత్తి చేయబడుతున్నాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ దేశంలో 7 విమానాశ్రయాలను నడుపుతోంది. ఇది నవీ ముంబైలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. ఇక్కడ FY25 చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కొత్త విమానాశ్రయం చేరికతో ప్రయాణీకుల రద్దీలో జంప్‌కు దారితీసే అవకాశం ఉందని అధికారి తెలిపారు.


Click it and Unblock the Notifications