Adani News: అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ దేశంలోని అనేక విమానాశ్రయాలను కొనుగోలు చేసి వాటిని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో ఇప్పటికే పెద్ద ఆగడిగా అవతరించిన ఆయన ఇతర దేశాల్లోని విమానాశ్రయాల నిర్వహణకు వెళ్లగా బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానయాన రంగంలో మరింతగా వ్యాపారాన్ని విస్తరించేందుకు చర్చలు ప్రారంభించారు.
ఈ క్రమంలో తన విమానయాన పరిశ్రమలో తన సేవా సామర్థ్యాలను పెంచుకోవడానికి అదానీ గ్రూప్ కొత్త కూటమిని ఏర్పాటు చేయడానికి బొంబార్డియర్ సీఈవో ఎరిక్ మార్టెల్‌తో ఒక ప్రధాన సమావేశాన్ని నిర్వహించింది. ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసులు, MRO, డిఫెన్స్‌లో భాగస్వామ్యాన్ని చర్చించినట్లు అదానీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఏవియేషన్ కంపెనీ ప్రధాన వాటాదారుడు పుంజ్ లాయిడ్ గ్రూప్ లిక్విడేషన్‌లోకి వెళ్లడంతో గ్రూప్ గత సంవత్సరం.. నిర్వహణ మరమ్మత్తు ఓవర్‌హాల్ (MRO) కంపెనీ ఎయిర్ వర్క్స్ ప్రతిపాదిత రూ.400 కోట్ల కొనుగోలును నిలిపివేసిన తర్వాత ఇది జరిగింది. దీని ఫలితంగా 2022లో అదానీ ప్రతిపాదించిన ఒప్పందం క్లోజ్ చేయలేకపోయింది.

బొంబార్డియర్ కెనడా ప్రముఖ వ్యాపార జెట్ తయారీదారు. విమానాల ఉత్పత్తి, రక్షణలో ప్రత్యేకత కలిగిన వాణిజ్య సామ్రాజ్యం కలిగి ఉంది. బాంబార్డియర్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీలు, ప్రభుత్వాలు అలాగే సూపర్ ధనవంతులు ఉపయోగిస్తున్నారు. అదానీ గ్రూప్ కేవలం విమానాశ్రయ సేవలను మాత్రమే అందజేస్తుండగా, విమానాలకు కూడా అనుబంధ సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఈ సేవల కోసం ప్రస్తుతం అన్ని విమానయాన సంస్థలు విదేశీ కంపెనీలపై ప్రధానంగా ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో MRO సేవల్లో "ఆత్మనిర్బర భారత్" సాధించటానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా అదానీ గ్రూప్ వేగంగా అడుగులు వేస్తోంది.
ఎరిక్ మార్టెల్ గౌతమ్ అదానీ సమావేశం భారతదేశ విమానయాన పరిశ్రమలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. విదేశీ MRO సేవలపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో, స్థానిక MRO రంగాన్ని సృష్టించి ఆధిపత్యాన్ని సాధించాలని అదానీ ప్రయత్నిస్తోంది. వాస్తవానికి ఈ కూటమి ఏర్పాటు ఎయిర్‌లైన్ కార్యకలాపాలలో అదనపు ఖర్చులను తగ్గించటంలో తోడ్పడుతుందని తెలుస్తోంది. ఇది విజయవంతమైతే విమానాల మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ రంగంలో భారత్ కొత్త హబ్‌గా అవతరించటానికి చక్కటి అవకాశాలు లభిస్తాయని ఏవియేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ భారతదేశ రక్షణ ఏరోస్పేస్ రంగాల్లో తన పాదముద్రను విస్తరిస్తూనే ఉంది. ఇది ఇప్పుడు విమానాశ్రయ సేవల నుంచి విమానయాన సేవలకు విస్తరించే ప్రక్రియలో ఉంది. దేశంలో MRO పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విమానాలు, విమాన ఇంజిన్ భాగాలపై 5 శాతం జీఎస్టీని అమలు చేస్తున్ సంగతి తెలిసిందే. ఇది పోటీతత్వాన్ని పెంచటంతో పాటు మరింత వ్యాపారాన్ని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. గతంలో వివిధ భాగాలకు వేర్వేరు GST రేట్లు ఉండటం వల్ల పరిశ్రమకు ఖర్చులు పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించటం కొత్త వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications