ఇండియాలోని మూడవ అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన అదానీ గ్రూప్ షేర్లన్నీ నిన్న సోమవారం భారీగా పరుగులు పెట్టాయి. మీడియా నివేదికల ప్రకారం, అదానీ ప్రతినిధులు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను కలిశారు. భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ కాంట్రాక్టులను పొందేందుకు అదానీ గ్రూప్ అధికారులు కొందరు లంచాలు చెల్లించి, ఈ విషయాన్ని అమెరికన్ పెట్టుబడిదారులకు దాచిపెట్టారని అమెరికాలోని అధికారులు ఆరోపించారు. ఈ అభియోగాలను ఎత్తివేయడానికి సంబంధించి అదానీ గ్రూప్ ప్రతినిధులు అమెరికన్ అధికారులను కలిశారని సమాచారం. అయితే ఈ వార్త తెలిసిన వెంటనే, అదానీ గ్రూప్ షేర్లు 10% కంటే పైగా పెరిగాయి.

దింతో అదానీ టోటల్ గ్యాస్ అత్యధికంగా 11.01 శాతం లాభపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 6.96 శాతం, అదానీ పవర్ 5.96 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 6.61 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.3 శాతం, అదానీ పోర్ట్ 6.29 శాతం, అంబుజా సిమెంట్ 1.76 శాతం, ఎస్‌సిసి 1.04 శాతం, ఎన్‌డిటివి 4.74 శాతం చొప్పున లాభపడ్డాయి. ఈ పెరుగుదలతో కంపెనీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ $5.61 బిలియన్లు అంటే 47 వేల కోట్లు పెరిగింది.
నిన్న సోమవారం నాటికి ఆయన అత్యధికంగా సంపాదిస్తున్న బిలియనీర్‌గా నిలిచారు. దీనితో ఈ సంవత్సరం అదానీ నికర విలువ మొదటిసారిగా సానుకూలంగా మారింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అతని నికర విలువ $82.2 బిలియన్లకు చేరుకుంది. అంటే ఈ సంవత్సరం మొదటి నుండి అతని నికర విలువ $3.49 బిలియన్లు పెరిగింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో ఆయన 20వ స్థానంలో ఉన్నారు.
ముఖేష్ అంబానీ నికర విలువ: ఇదిలా ఉండగా ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ నికర విలువ సోమవారం $4.97 బిలియన్లు తగ్గింది. ఈ సంవత్సరం మొత్తంగా చూస్తే ఆయన నికర విలువ 101 బిలియన్ డాలర్లు తగ్గి 331 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ 212 బిలియన్ డాలర్లతో రెండవ స్థానానికి పడిపోయారు, అమెజాన్ సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (209 బిలియన్ డాలర్లు) మూడవ స్థానానికి ఉన్నారు. అలాగే ఈ లిస్టులో లారీ ఎల్లిసన్ ($172 బిలియన్) నాల్గవ స్థానంలో, బిల్ గేట్స్ ($169 బిలియన్) ఐదవ స్థానంలో, వారెన్ బఫెట్ ($160 బిలియన్) ఆరవ స్థానంలో, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ($155 బిలియన్) ఏడవ స్థానంలో, స్టీవ్ బాల్మెర్ ($152 బిలియన్) ఎనిమిదవ స్థానంలో, లారీ పేజ్ ($149 బిలియన్) తొమ్మిదవ స్థానంలో, సెర్గీ బ్రిన్ ($140 బిలియన్) పదవ స్థానంలో ఉన్నారు.
మరోవైపు భారతదేశం సహా ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ 104 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో 16వ స్థానంలో నిలిచారు. దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ నికర విలువ సోమవారం $994 మిలియన్లు పెరిగింది. ఈ సంవత్సరంలో అతని నికర విలువ $13.8 బిలియన్లు పెరిగింది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ $99.9 బిలియన్ల నికర విలువతో 17వ స్థానంలో ఉన్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications