నా చేతిలో చిల్లిగవ్వ లేదు కానీ.. 19 ఏళ్లకే 10 వేల కమిషన్..: గౌతమ్ అదానీ

పోర్ట్స్, ఇంధనం, లాజిస్టిక్స్‌లో సహా అతిపెద్ద మౌలిక సదుపాయాల సామ్రాజ్యాన్ని నిర్మించిన బిలియనీర్ వ్యవస్థాపకుడు, భారతదేశ అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ తాజాగా అదానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లోని విద్యార్థులతో తన ఒకప్పటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. కాలేజీ డ్రాపౌట్ అయిన అదానీ తన కలల కోసం 16 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లాడు. ప్రస్తతం గౌతమ్ అదానీకి 62 ఏళ్ళు.

అయితే ఒకప్పటి అనుభవాల గురించి మాట్లాడుతూ అతను 19 సంవత్సరాల వయస్సులో తన మొదటి వ్యాపారం నుండి రూ. 10,000 కమీషన్ సంపాదించినట్లు గుర్తుచేసుకున్నాడు. అహ్మదాబాద్‌లో జన్మించిన అదానీ ముంబైలోని ఐకానిక్ జవేరీ బజార్‌లోని డైమండ్ వ్యాపార కంపెనీలో పని చేస్తూ తన వృత్తిని ప్రారంభించాడు. కేవలం మూడు సంవత్సరాలలో అతను వ్యాపారంలో మెలుకువలు నేర్చుకున్నాడు. తరువాత తన స్వంత డైమండ్ ట్రేడింగ్ బ్రోకరేజీని స్థాపించి వ్యాపార రంగంలోకి ప్రవేశించాడు.

gautam Adani made Rs 10 000 commission from first trade in 1981 at the age of 19 speaking at Adani International School

"నేను జపనీస్ కొనుగోలుదారుతో నా మొదటి వ్యాపారం చేసిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు నేను రూ. 10,000 కమీషన్ తీసుకున్నాను. నా వయస్సు 19 సంవత్సరాలు, ఇది వ్యాపారవేత్తగా నా ప్రయాణనికి ప్రారంభం" అంటూ అదానీ మాట్లాడుతూ చెప్పాడు. ఇది 1981వ సంవత్సరంలో జరిగింది.

నేడు కాలేజీకి వెళ్లుంటే నా జీవితం ఇంకోలాగ ఉండేది, నన్ను ఎప్పుడూ ఈ ప్రశ్న వేధిస్తూనే ఉంటుంది అని అన్నారు. జీవితంలో అనుభవపూర్వకంగా తెలివితేటలు సంపాదించుకోవచ్చు. కానీ, జ్ఞానాన్ని సంపాదించాలంటే చదువు చాలా ముఖ్యం. ఒక వేళ నేను కాలేజీకి వెళ్లి చదువు పూర్తి చేసి ఉంటే నా సామర్థ్యం ఇంకా మెరుగ్గా ఉండేదని భావిస్తాను. ఎప్పుడూ దీని గురించి ఆలోచిస్తూనే ఉంటా.' అని అదానీ పేర్కొన్నారు.

అహ్మదాబాద్‌లో కుటుంబం సంపాదించిన చిన్న-స్థాయి PVC ఫిల్మ్ ఫ్యాక్టరీని నడిపేందుకు తన అన్న మహాసుఖ్‌భాయ్‌కు సహాయం చేయడానికి అతను మళ్ళీ గుజరాత్‌కు తిరిగి వచ్చాడు. 1988లో అతను అదానీ ఎక్స్‌పోర్ట్స్ కింద కమోడిటీస్ ట్రేడింగ్ వెంచర్‌ను స్థాపించాడు, అలాగే 1994లో దానిని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేశాడు. ఈ సంస్థను ఇప్పుడు అదానీ ఎంటర్‌ప్రైజెస్ అని పిలుస్తారు.

అదానీ దశాబ్దం తర్వాత గుజరాత్ తీరంలో ముంద్రా వద్ద ఓడరేవును నిర్వహించడం ప్రారంభించి భారతదేశపు అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా వ్యాపారాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అతను తన వ్యాపార సామ్రాజ్యాన్ని విద్యుత్ ఉత్పత్తి, మైనింగ్, ఎడిబుల్ ఆయిల్, గ్యాస్ పంపిణీ, పునరుత్పాదక ఇంధనంలోకి వేగంగా విస్తరించాడు. తరువాత అతని వ్యాపారాలు విమానాశ్రయాలు, సిమెంట్ ఇంకా ఇటీవల మీడియాకు కూడా విస్తరించాయి. గౌతమ్ అదానీ నేడు $ 76 బిలియన్ల సంపదతో ప్రపంచంలోని 19వ అత్యంత సంపన్న వ్యక్తి.

అలాగే అదానీ పెద్ద కలలు కనే శక్తిని, నిరంతరం నేర్చుకోవడం, ప్రపంచ సవాళ్లను పరిష్కరించే వ్యాపారాలను నిర్మించడం గురించి చెప్పారు. విద్యార్థులు దృఢంగా ఉండాలని, వినూత్నంగా ఆలోచించాలని, విజయానికి సొంత దారులు వెతుక్కోవాలని సూచించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+