For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gautam Adani: పిచ్చిపిచ్చిగా షాపింగ్ చేసిన అదానీ.. బిల్లు ఎంతో తెలుసా..? తాజా నివేదిక..

|

Gautam Adani: 2022లో అదానీ చేసిన ప్రతి పనీ ఒక రికార్డే. వ్యాపార రంగంలో ఆయన ఇప్పటి వరకు చేసిన కృషి ఒక ఎత్తైతే కేవలం 2022లో చేసింది చాలా రెట్లు ఎక్కువని చెప్పుకోవాలి. రైట్ టైమ్ లో కరెక్ట్ నిర్ణయాలు తీసుకునేందుకే గౌతమ్ అదానీ ఇంత దుందుడుగా వ్యవహరించారా అనే సమాదానం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

అదానీ షాపింగ్ రికార్డ్..

అదానీ షాపింగ్ రికార్డ్..

మనం సహజంగా షాపింగ్ అంటే ఏదైన ఇష్టమైన వస్తువులు లేదా బట్టలు కొనుక్కుంటాం. కానీ గౌతమ్ అదానీ విషయంలో షాపింగ్ అంటే కంపెనీలను కొనుగోలు చేయటం అని అర్థం. ఇది మనం చెప్పుకోవటానికి కొంత అతిశయోక్తిలాగా ఉన్నా ఆయన 2022లో చేసింది ఇదేనని తాజా బ్లూమ్ బెర్గ్ నివేదిక చెబుతోంది.

ఈ క్రమంలో ఆయన వ్యాపారల షాపింగ్ కోసం ఏకంగా బిలియన్ డాలర్లను వెచ్చించారు. సిమెంట్ నుంచి పవర్ వరకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అదానీ కొనేశారు. అసలు భవిష్యత్తులో వ్యాపారాలన్నీ అదానీవేనా అన్నంత వేగంగా ఈ డీల్స్ జరగటం భారత వ్యాపార సామ్రాజ్యంలో చర్చకు దారితీసింది.

డీల్ మేకర్..

డీల్ మేకర్..

గౌతమ్ అదానీ ప్రపంచవ్యాప్తంగా 2022లో అత్యంత బిజీ డీల్ మేకర్ గా నిలిచారు. బ్లూమ్ బెర్గ్ ఇదే విషయాన్ని తన తాజా నివేదికలో వెల్లడించింది. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపద పెరిగిన వ్యక్తుల జాబితాలో గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది అదానీ వ్యక్తిగత సంపద 49 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ రేసులో అదానీ ఏకంగా మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, వారెన్ బఫెట్లను సైతం వెనక్కు నెట్టాడు. అలా బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ మెుత్తం ఆస్తుల విలువ దాదాపుగా 125 బిలియన్ డాలర్లకు చేరుకుని ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనికుడిగా నిలిచారు.

అదానీ కొన్న కంపనీలు..

అదానీ కొన్న కంపనీలు..

ఈ ఏడాది అదానీ గ్రూప్ లోకి చాలా కంపెనీలు వచ్చి చేరాయి. అలా స్విస్ సిమెంట్ మేజర్ హోల్సిమ్ లిమిటెడ్ నుంచి అంబుజా, ACC సిమెంట్‌లను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో అదానీ విల్మర్ కోహినూర్ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. ఇంతే కాకుండా ఇజ్రాయెల్ కు చెందిన పోర్ట్ హైఫాను కొనుగోలు చేసే బిడ్ కూడా గెలిచింది. ఇటీవల అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా 2.45 బిలియన్ డాలర్లను సేకరించే ప్రణాళికను ఆమోదించింది. అలా అదానీ శరవేగంగా విస్తరిస్తూ ఇటీవల మీడియా రంగంలోని ఎన్డీటీవీని సైతం హస్తగతం చేసుకున్నారు. ఇది అదానీ షాపింగ్ అంటే..

Read more about: adani deal maker gautam adani
English summary

Gautam Adani: పిచ్చిపిచ్చిగా షాపింగ్ చేసిన అదానీ.. బిల్లు ఎంతో తెలుసా..? తాజా నివేదిక.. | Gautam Adani made many deals 2022 added companies to his group globally

Gautam Adani made many deals 2022 added companies to his group globally
Story first published: Friday, December 16, 2022, 18:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X