For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gautam Adani: గౌతమ్ అదానీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ.. IPO ఈనెల 11న ప్రారంభం.. మిస్ కాకండి

|

Gautam Adani: భారత స్టాక్ మార్కెట్లోకి మరోసారి వరుసగా ఐపీవోలు క్యూ కట్టాయి. ఇటీవల వరుసగా నాలుగు కంపెనీలు తమ ఐపీవోను లాంచ్ చేయగా వచ్చే వారం మరో కంపెనీ వస్తోంది. అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటంటే సదరు కంపెనీలో బిలియనీర్ గౌతమ్ అదానీ ఇన్వెస్ట్ చేయటమే.

 IPO వివరాలు..

IPO వివరాలు..

విండ్‌ టర్బైన్ల మెయింటెనెన్స్ వ్యాపారంలో ఉన్న ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ IPO నవంబర్ 11న ప్రారంభం అవుతోంది. ఈ ఐపీవో నవంబర్ 15న ముగుస్తుంది. అయితే షేర్ ప్రైస్ బ్యాండ్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించబడలేదు. అయితే ఒక్కో ఈక్విటీ షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.10గా కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం.

 మూలధన సమీకరణ..

మూలధన సమీకరణ..

ఐపీవో ద్వారా మెుత్తం రూ.740 కోట్లను సమీకరించేందుకు కంపెనీకి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇందులో రూ.370 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఫ్రెష్‌ ఇష్యూ ఉంటుంది. మిగిలిన రూ.370 కోట్లు ప్రమోటర్ కంపెనీ ఐనాక్స్ విండ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తోంది. దీని ద్వారా సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ రుణాల చెల్లింపుకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించనుంది. Edelweiss ఫైనాన్షియల్ సర్వీసెస్, DAM క్యాపిటల్ అడ్వైజర్స్, ఈక్విరస్ క్యాపిటల్, IDBI క్యాపిటల్ మార్కెట్స్ & సెక్యూరిటీస్, సిస్టమాటిక్స్ కార్పొరేట్ సర్వీసెస్ ఐపీవోను ఫ్లోట్ చేస్తున్నాయి.

అదానీ హస్తగతం..

అదానీ హస్తగతం..

ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ అనేది ఇప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన Inox Wind అనుబంధ సంస్థ. అందువల్ల ఐనాక్స్ గ్రీన్ లో ఈ కంపెనీకి 95 శాతం వాటా ఉంది. ఇటీవల ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ మూడు ప్రత్యేక యూనిట్లలో (SPVలు) తన మొత్తం ఈక్విటీ వాటాను గౌతమ్ అదానీ సంస్థ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీకి విక్రయించింది. గత అక్టోబర్‌లో ఐనాక్స్ విండ్ తన అనుబంధ సంస్థ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా విండ్ వన్ రెనర్జీ లిమిటెడ్, విండ్ త్రీ రెనర్జీ లిమిటెడ్‌లను కొనుగోలు చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలిపింది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

విండ్ ఎనర్జీ తయారు చేసే ఫామ్ ప్రాజెక్టుల్లో విండ్‌ టర్బైన్ల మెయింటెన్ చేసే దీర్ఘకాలిక సేవలను ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ అందిస్తుంది. విండ్ టర్బైన్ జనరేటర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పనను సైతం కంపెనీ చూస్తుంది. రానున్న కాలంలో శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా విండ్ ఎనర్జీ ఉన్నందున కంపెనీ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

English summary

Gautam Adani: గౌతమ్ అదానీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ.. IPO ఈనెల 11న ప్రారంభం.. మిస్ కాకండి | Gautam Adani Invested Inox Green Energy Services Launching IPO on November 11th 2022

Gautam Adani Invested Inox Green Energy Services Launching IPO on November 11th 2022
Story first published: Sunday, November 6, 2022, 12:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X