Adani News: గౌతమ్ అదానీ బిగ్ స్కెచ్.. గ్యాస్‌తో గురిపెట్టి ఆఫ్‌షోర్ బ్యాంకులతో మీటింగ్స్
Adani Total: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన గ్రూపు సంస్థలు ఇటీవలే సంక్షోభం నుంచి బయటపడి మంచి వృద్దిని నమోదుచేస్తున్నాయి. ఇదే సమయంలో ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయంగా పలు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. కానీ భారీ రుణ సమీకరణ దిశగా గ్రూప్ ఛైర్మన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూపు కంపెనీలు ఇప్పటికే ఉన్న రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి సుమారు 600 మిలియన్ డాలర్ల ఆఫ్‌షోర్ రుణాన్ని కోరుతోంది. అదానీ టోటల్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ ధామ్రా LNG టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రుణాన్ని సమీకరించనుంది. ఈ మేరకు ప్రముఖ మీడియా౩ సంస్థ బ్లూమ్‌బెర్గ్ ఓ నివేదికను రిలీజ్ చేసింది.

ఈ రుణం వ్యవధి 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. దీని వడ్డీ రేటు సెక్యూర్డ్ ఓవర్‌నైట్ ఫైనాన్సింగ్ రేట్‌తో ముడిపడి ఉంటుందని నివేదిక పేర్కొంది. క్రెడిట్ అగ్రికోల్, DBS బ్యాంక్ లిమిటెడ్, BNP పారిబాస్, మిత్సుబిషి UFJ ఫైనాన్షియల్ గ్రూప్ ఇంక్ మరియు మిజుహో బ్యాంక్ లిమిటెడ్‌తో సహా రుణదాతలతో ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. మరో 2 నెలల్లో ఈ రుణ సమీకరణను ముగించే అవకాశం ఉందని తెలిపింది.
US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల వల్ల అదానీ గ్రూపులో ఇటీవల సంక్షోభం ఏర్పడింది. కాగా గౌతమ్ అదానీ సమయానుగుణ చర్యల వల్ల గ్రూపు కంపెనీలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందాయి. ఇప్పుడు చర్చల్లో ఉన్న అదానీ టోటల్ అనేది అదానీ మరియు టోటల్ ఎనర్జీల కంబైన్డ్ వెంచర్. Q4లో అదానీ టోటల్ గ్యాస్ నికర లాభం 71.6 శాతం పెరిగింది. మార్చి 2023 త్రైమాసికంలో 97.9 కోట్లు కాగా Q4లో 168 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications