Gautam Adani: మోదీ 3.0 సమయంలో గౌతమ్ అదానీ ప్రధానంగా ఇన్‍ఫ్రా రంగంపై తన ఫోకస్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా నిర్మాణ రంగంలోని కంపెనీలతో పాటు సిమెంట్ వ్యాపారంపై కూడా భారీగా పెట్టుబడులు పెట్టి అనేక కంపెనీల్లో కీలక వాటాలను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా మరో కంపెనీ కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
గౌతమ్ అదానీ గ్రూప్ PSP ప్రాజెక్ట్స్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తోందని వెల్లడైంది. ఈ వార్త వెలుగులోకి రావటంతో కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిదారుల నుంచి భారీగా డిమాండ్ కనిపించింది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్ల ధర ఏకంగా 15 శాతం పెరిగి రూ.734.75 వద్దకు చేరుకుంది. కంపెనీ షేర్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో తన 52 వారాల గరిష్ఠమైన రూ.809.95 స్థాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అక్టోబర్ మాసంలో స్టాక్ ధర 52 వారాల కనిష్ఠమైన రూ.566.50కి దిగజారింది. కానీ ఇప్పుడు అదానీ గ్రూప్ కొనుగోలు వార్తలో తిరిగి వేగంగా పుంజుకుంటోంది. అయితే చివరికి మార్కెట్ల ముగింపు నాటికి నేడు ఎన్ఎస్ఈలో స్టాక్ 3.53 శాతం లాభంతో రూ.666.50 రేటు వద్ద స్థిరపడ్డాయి.

గుజరాత్‌కు చెందిన ఈ నిర్మాణ సంస్థలో ప్రధాన వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోందని సమాచారం. అదానీ గ్రూప్ సదరు కంపెనీలో 60.14% వరకు వాటాను కొనుగోలు చేయవచ్చని అంతర్గత సమాచారం విషయం తెలిసిన వ్యక్తుల ద్వారా వెల్లడైంది. ఒకవేళ డీల్ పూర్తయితే 26% పబ్లిక్ షేర్ హోల్డింగ్ కోసం ఆఫర్ ఫర్ సేల్ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అదానీ గ్రూప్ కానీ PSP ప్రాజెక్ట్స్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కంపెనీలో అదానీ గ్రూప్ వ్యూహాత్మకంగా పెట్టుబడికి అనుగుణంగా ఉండనుందని తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అదానీ గ్రూప్ 5-7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నందున సిమెంట్, విమానాశ్రయాలు, డిఫెన్స్, షిప్ యార్డ్స్, విద్యుత్ సహా రంగాల్లో విస్తరించాలని చూస్తోంది.
ప్రస్తుతం PSP ప్రాజెక్ట్స్ కంపెనీలో ప్రమోటర్లకు 60.14 శాతం వాటాలు ఉన్నాయి. ఇక మిగిలిన వాటా పబ్లిక్ హోల్డ్ చేస్తోది. ఈ క్రమంలో కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన ప్రహ్లాద్‌భాయ్ ఎస్ పటేల్ అత్యధికంగా 47 శాతానికి పైగా మెజారిటీ వాటాలను హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన వాటాలను పూజా పటేల్, సాగర్ పటేల్ హోల్డ్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్ల ధర 13 శాతం మేర నష్టాన్ని చూసింది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications