Gautam Adani: జనవరి 24న హిండెన్ బర్గ్ భారత వ్యాపార దిగ్గజం అయిన అదానీ గ్రూప్ ను టార్గెట్ చేసింది. కంపెనీ అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడిందంటూ తన నివేదికలో ఆరోపించింది. పైగా కంపెనీకి ఉన్న అప్పులపై కూడా కామెంట్స్ చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన అదానీ గ్రూప్ హిండెన్ బెర్గ్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని ప్రకటించింది.

రెండు వారాల తర్వాత..
అమెరికా రీసెర్చ్ సంస్థపై ఎలా చర్యలు తీసుకోవాలనే విషయంపై గౌతమ్ అదానీ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అమెరికాకు చెందిన వాచ్‌టెల్ న్యాయ సంస్థను నియమించుకున్నారు. వాల్ స్ట్రీట్ లో వాచ్‌టెల్.. భయంకరమైన రక్షణ న్యాయ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ చర్యల ద్వారా ఇన్వెస్టర్లలో కంపెనీ ఆర్థిక ఆరోగ్యంపై ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా అమెరికా కంపెనీని న్యాయపోరాటానికి నియమించుకుంది.

సంప్రదింపులు ఇలా..
అదానీ గ్రూప్ రక్షణకు నాయకత్వం వహిస్తున్న సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ సంస్థ కార్యాలయంలో సమ్మేళనం ద్వారా వాచ్‌టెల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్‌కు సిరిల్ ష్రాఫ్ నాయకత్వం వహిస్తున్నారు. మంగళదాస్ కుమార్తె గౌతమ్ అదానీ కుమారుడిని వివాహం చేసుకుంది. దీంతో న్యాయపరంగా హిండెన్ బెర్గ్ ను ఎదుర్కొనేందుకు.. వాచ్‌టెల్ అదానీ గ్రూప్ కు సలహాదారుగా నిలవనుంది.

భారీగా నష్టం..
హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయింది. Credit Suisse, Citigroup, Standard Chartered వంటి రుణదాతలు మార్జిన్ లోన్‌ల కోసం అదానీ బాండ్లను తాకట్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్థ నార్వేకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ అదానీ గ్రూపు నుంచి తన రూ. 1,651 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకుంది.


Click it and Unblock the Notifications