Gautam Adani: హిండెన్ బర్గ్ ఆరోపణలతో ఒక్కసారిగా అందరూ ఉన్న ఏకాకిగా మారారు దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా అనేక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ ఇది జరిగి దాదాపు రెండు వారాలు గడుస్తున్న తర్వాత పరిస్థితులు పూర్తిగా మారినట్లు తెలుస్తోంది.

మెగా ప్రాజెక్ట్..
మహారాష్ట్ర ప్రభుత్వం తన తాజా నిర్ణయంతో అదానీకి అండగా నిలుస్తోంది. అతిపెద్ద మురికివాడగా ఉన్న ధారావీని రీడెవలప్ మెంట్ ప్రాజెక్టును అధికారికంగా అదానీ గ్రూప్‌కు అప్పగించడానికి సన్నాహాలు చేస్తోంది ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం. ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్‌కు అప్పగించడానికి ప్రభుత్వ తీర్మానాన్ని (GR) జారీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు.

బిడ్ వివరాలు..
ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గతంలో అదానీ గ్రూప్ బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంచనా వేసిన రూ.23,000 కోట్ల ప్రాజెక్ట్ కోసం రూ.5,069 కోట్లకు వేలం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలోని మురికివాడల ప్రజలు లబ్ధి పొందనున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద ధారవిలోని మురికివాడల్లో నివసిస్తున్న అర్హులైన ప్రజలు ఉచితంగా ఇళ్లను పొందనున్నారు.

మంత్రి వర్గం ఆమోదం..
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ రద్దును సవాలు చేస్తూ దుబాయ్‌కి చెందిన సెక్లింక్ గ్రూప్ దాఖలు చేసిన కేసు బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. గత డిసెంబరులో అదానీ గ్రూప్ కు ఈ ప్రాజెక్టును అప్పగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
దీనికి అవసరమైన 47 ఎకరాల రైల్వే భూమిని జాయింట్ మెజర్‌మెంట్ చివరి దశలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2019లో భూమికి రూ.800 కోట్లు అడ్వాన్స్ కూడా చెల్లించింది. మెుత్తం 178 హెక్టార్లలో ఈ ప్రాజెక్టు అమలు జరుగుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications