For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gautam Adani: మూడో స్థానం నుంచి 38కి గౌతమ్ అదానీ.. నలిగిపోతున్న బిలియనీర్

|

Gautam Adani: దేశంలో కార్పొరేట్ శక్తిగా ఎదగడానికి గౌతమ్ అదానీ ఎంత కష్టపడ్డారో.. ఇప్పుడు దానిని నిలబెట్టుకునేందుకూ అంతే కష్టపడుతున్నారు. హిండెన్ బెర్గ్ నివేదిక తర్వాత అదానీ ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానం నుంచి ఏకంగా 38వ స్థానానికి పడిపోయారు. అయితే తాను ఈ అంకెలను నమ్మబోనని.. తన పని తాను చేసుకుంటూ పోతానని గతంలో ఒక ఇంటర్వ్యూలో అదానీ స్పష్టం చేశారు.

ఫోర్బ్స్ తాజా డేటా..

ఫోర్బ్స్ తాజా డేటా..

ప్రస్తుతం ఫోర్బ్స్ రియల్ టైమ్ ట్రాకర్ ప్రకారం అదానీ నికర విలువ 33.4 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరి 24న హిండెన్ బెర్గ్ నివేదికు ముందు జనవరి 24న అదానీ ఆస్తుల విలువ 119 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రతి రోజూ సంపద ఆవిరి అవుతున్న తరుణంలో తాజాగా ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఏకంగా 38వ స్థానానికి దిగజారారు. అలాగే బీఎస్ఈ సమాచారం ప్రకారం గ్రూప్ కంపెనీల సంయుక్త నికర విలువ 150 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది.

1988లో ప్రయాణం..

1988లో ప్రయాణం..

గౌతమ్ అదానీ చిన్న కమోడిటీస్ ట్రేడగ్ గా తన వ్యాపార ప్రస్థానాన్ని 1988లో ప్రారంభించారు. అలా ఆయన ప్రయాణం ప్రస్తుతం దేశంలోని ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, పవర్, మౌలికసదుపాయాలు వంటి అనేక రంగాలకు విస్తరించి సంచలనాలు సృష్టించారు. అనతికాలంలోనే అనేక మైలురాళ్లను అధిగమించి అసాధ్యాలను సుసాధ్యమని నిరూపించారు. ఈ క్రమంలో ఇటీవల్ అదానీ ఎంటర్ ప్రైజెస్ 20 వేల కోట్ల రూపాయల ఎఫ్పీవోను రద్దు చేయగా.. DB పవర్ నుంచి అదానీ పవర్ బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ కొనుగోలుకు చేసుకున్న రూ.7,017 కోట్ల ఒప్పందం నుంచి తప్పుకుంది.

పడిపోయిన విలువ..

పడిపోయిన విలువ..

హిండెన్ బెర్గ్ నివేదిక తర్వాత.. ప్రస్తుతం సమాచారం ప్రకారం అదానీ టోటల్ గ్యాస్ 81.6 శాతం, అదానీ గ్రీన్ 75.8 శాతం, అదానీ ట్రాన్స్ మిషన్ 75.5 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 65.3 శాతం, అదానీ పవర్ 49.2 శాతం, అదానీ విల్మార్ 39.9 శాతం, ఎన్డీటీవీ 36.2 శాతం, అంబుజా సిమెంట్స్ 33.9 శాతం, ఏసీసీ సిమెంట్స్ 27.4 శాతం, అదానీ పోర్ట్స్ 26.1 శాతం మేర కంపెనీ విలువను కోల్పోయాయి. ఈ కారణంగా గ్రూప్ కంపెనీల సంయుక్త విలువ రూ.19.2 లక్షల కోట్ల నుంచి రూ.6.8 లక్షల కోట్లకు చేరుకుంది.

English summary

Gautam Adani: మూడో స్థానం నుంచి 38కి గౌతమ్ అదానీ.. నలిగిపోతున్న బిలియనీర్ | Gautam adani fall to 38th position in forbes rich list as wealth evapourating quickly

Gautam adani fall to 38th position in forbes rich list as wealth evapourating quickly
Story first published: Tuesday, February 28, 2023, 12:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X