Jeet Adani Wedding: భారతదేశంలోని ప్రముఖ సంపన్న వ్యాపారుల్లో అదానీ, అంబానీలు ఉన్నారు. గడచిన ఏడాది ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని దాదాపు రూ.5,000 కోట్లు వెచ్చించి అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ క్రమంలో దేశవిదేశాల నుంచి అతిరుథులతో ముంబై నగరం కిక్కిరిసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా 2025లో దేశంలోని మరో సంపన్నుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ పెళ్లి జరిగింది. ఈ క్రమంలో జీత్ అదానీ దివా షా వివాహం జరిగింది. అంబానీ మాదిరిగా అదానీ తన కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించలేదు. అదానీ తన కుమారుడి వివాహాన్ని సింపుల్‌గా నిర్వహించడమే కాకుండా రూ.10,000 కోట్లు విరాళంగా ప్రకటించారు. అయితే ఈ విరాళంలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, ఎడ్యుకేషన్, నైపుణ్యాభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించారు.

అదానీ ప్రకటించిన విరాళంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన ఆసుపత్రులు, వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావటంపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడైంది. గ్లోబల్ స్కిల్స్ అకాడమీలను అప్‌గ్రేడ్ చేయడానికి డబ్బు వినియోగించబడుతుందని వెల్లడైంది. అదానీ తన కుమారుడి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే జీత్ అదానీ వివాహానికి సన్నిహితులను ఆహానించనందుకు క్షమాపణలు సైతం కోరారు. అహ్మదాబాద్‌లో సాంప్రదాయ ఆచారాలు, శుభ్ మంగళ్ భావ్ తో ప్రియమైనవారి మధ్య జరిగిందని వెల్లడించారు.
వివాహానికి ముందు అదానీ గ్రూప్ 'మంగళ సేవా' చొరవను ప్రారంభించింది. ప్రతి సంవత్సరం కొత్తగా వివాహం చేసుకున్న 500 మంది వికలాంగ మహిళలకు ఆర్థిక సహాయం అందించబడుతుందని వెల్లడించారు. అదానీ గ్రూప్ ఇచ్చిన సమాచారం ప్రకారం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అతనికి ప్రతి సంవత్సరం రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది. జీత్ అదానీ కొత్తగా పెళ్లైన 25 మంది వికలాంగ మహిళలను, వారి భర్తలను స్వయంగా కలిసి ఆ జంటలకు ఆర్థిక సహాయం అందించారు.
గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ సైతం చాలా కాలం నుంచి అదానీ గ్రూప్ వ్యాపారాలను నిర్వహించటంలో యాక్టివ్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 2019 సంవత్సరంలో అదానీ గ్రూప్‌లో చేరగా గ్రూప్ సీఎఫ్ఓగా కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం జీత్ అదానీ విమానాశ్రయ వ్యాపారానికి అలాగే అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. జీత్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి తన విద్యాభ్యాసం పూర్తి చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications