Adani Vs Ambani: ముంబైలో అంబానీకి ఎదురిస్తున్న అదానీ.. ఇక ప్రత్యకంగా యుద్ధమే, ఎందుకంటే..?

Adani Group News: భారతదేశంలో ప్రస్తుతం వేగంగా తమ వ్యాపారాలను అనేక కొత్త రంగాల్లోనికి విస్తరిస్తున్న వారిలో ముందు వరుసగా రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అంబానీ-అదానీ నేరుగా వ్యాపారంలో పోటీపడేందుకు ప్రస్తుతం ముంబై కేంద్రంగా మారబోతోంది. దీనికి సంబంధించి అదానీ గ్రూప్ భారీ వ్యూహాన్ని సిద్ధం చేయటంతో పాటు ఎగ్జిక్యూట్ చేసేందుకు పెద్ద పెట్టుబడిని అందుకోసం కేటాయించిందని తెలుస్తోంది.

దేశ ఆర్థిక రాజధానిగా ఉంటూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై నగరంలో భారీ పెట్టుబడులకు అదానీ గ్రూప్ మెగా ప్లాన్ సిద్ధం చేసిందని సమాచారం. ఈ క్రమంలో ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో అతిపెద్ద అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్(ICC)ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఏకంగా 2 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.17,000 కోట్లుగా ఉండనుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ దాని విస్తృత పరిధిని కవర్ చేస్తూ ఈ కేంద్రం రూపకల్పనకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు బ్లూప్రింట్‌కు రెండు నెలల్లో ఆమోదం లభించనుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు అంబానీ నిర్మించిన జియో వరల్డ్ సెంటర్‌కు పోటీగా నిలుస్తుందని తెలుస్తోంది.

Gautam Adani building International Convention Center near Mumbai Airport to compete with Jio World

ముంబైలో అదానీ గ్రూప్ తలబెడుతున్న కొత్త ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి దాదాపు 5 లక్షల కంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అంచనా వేయబడింది. ఈ కార్పొరేట్ హబ్ ఇప్పటికే అంబానీ గ్రూప్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు గట్టి పోటీని ఇవ్వనుంది. అదానీ తన ప్రాజెక్టును వ్యూహాత్మకంగా విలే పార్లే పశ్చిమ శివారులో విమానాశ్రయానికి దగ్గరగా ఏర్పాటు చేస్తున్నారని వెల్లడైంది. ఎయిర్ పోర్టుకు అత్యంత సమీపంలో రూపకల్పన చేయనున్న ఈ ప్రాజెక్టు ఏకకాలంలో 20,000 మంది అతిధులు కూర్చునేందుకు వీలుగా భారీ విస్తీర్ణంలో నిర్మాణాన్ని చేపడుతోంది. ఇది అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ యాజమాన్యంలో జరగనుందని తెలుస్తోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అదానీ గ్రూప్ నిర్మించనున్న అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్(ICC).. 275 గదులతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్‌ను కూడా నిర్వహిస్తుందని సమాచారం. ఇప్పటి వరకు ముంబై మహానగరంలో అంబానీకి చెందిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ అతిపెద్ద విస్తీర్ణం కలిగిన సెంటర్. ఇందులో దేశవిదేశాలకు చెందిన అనేక బ్రాండ్స్ తమ స్టోర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆపిల్ సైతం తన సొంత అధికారిక స్టోర్ అంబానీకి చెందిన జియో వరల్డ్ లోనే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే న్యూదిల్లీలోని యశోభూమి భారతదేశపు అతిపెద్ద కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్. దీని విస్తీర్ణం దాదాపు 3.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.

దేశంలోని పెద్ద కంపెనీలు తమ ఇమేజ్ పెంచుకోవటం కోసం విమానాశ్రయాలు, రహదారి కనెక్టివిటీ ఉన్న చోట్ల భారీగా డబ్బు వెచ్చించి కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్‌ల వంటి ఈవెంట్‌లను నిర్వహించడానికి వీలుగా ఇలాంటి భారీ ప్రాజెక్టులను నిర్మిస్తుంటాయని అనరాక్ ప్రాపర్టీస్ చైర్మన్ అనూజ్ పూరి పేర్కొన్నారు. విమానాశ్రయాలకు దగ్గరగా ఉండటం వల్ల అతిథులకు సజావుగా ప్రయాణ ఏర్పాట్లను నిర్ధారిస్తుంది, ఇది సమయాన్ని ఆదా చేయటంతో పాటు అత్యుత్తమ సౌకర్యాలను అందించటానికి వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముంబై వంటి రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అతిథులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఇది విముక్తి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అదానీ గ్రూప్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పెద్ద సంచలనాలను సృష్టిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+