Adani Stocks: అదానీ గ్రూప్ ప్రస్తుతం దేశంలో అనేక కీలక రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉంది. పోర్టుల నుంచి విమానాశ్రయాల వరకు సిమెంట్ నుంచి సోలార్ పవర్ వరకు ఇందుగలను అందులేను అన్నట్లుగా అదానీ దూకుడు కొనసాగుతోంది. పైగా గతంలో కంటే చాలా వేగంగా వ్యాపారాలను ముందుకు నడిపించటంతో ఆయన సంపద కూడా అంతే స్పీడుగా పెరిగిపోతోంది.
అయితే అందరికీ అంతుచిక్కని విషయం ఏమిటంటే ఎన్ని ఆరోపణలు వచ్చినా సులువుగా అదానీ వాటిని ఎలా అధిగమించి ముందుకు సాగుతున్నారు అన్నదే. ఈ బిలియనీర్ ఇటీవల కుంభమేణాలో అన్నదానం చేయటానికి కూడా ఇస్కాన్ సంస్థతో జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఒక్క రోజులో అదానీ కెరటంలా నష్టాల నుంచి సంపదను పెంచుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి సోమనారం ఆయన సంపద 5.06 బిలియన్ డాలర్లు క్షీణించగా.. తిరిగి మంగళవారం 7.47 బిలియన్ డాలర్లు పెరగటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం బిలియనీర్ సంపద కేవలం మంగళవారం ఒక్కరోజునే రూ.61,192 కోట్లు పెరిగింది. దీంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదికలోని టాప్-20 మంది సంపన్నుల జాబితాలోకి ఆయన తిరిగి చోటు సంపాదించుకున్నారు. దీంతో ఒక్కరోజులోనే అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 22వ స్థానం నుంచి 20వ స్థానానికి తిరిగి వచ్చారు. ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా లాభపడటం దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.
అదానీకి ఏఏ కంపెనీలో ఎంత వాటా ఉందనే విషయాన్ని పరిశీలిస్తే.. లిస్టెడ్ ఎంటిటీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 74%, అదానీ పవర్ 75%, అదానీ టోటల్ గ్యాస్ 37%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 70%, అదానీ పోర్ట్స్ 66%, అదానీ గ్రీన్ ఎనర్జీ 61% వాటాను కలిగి ఉన్నారు. ఇదే క్రమంలో మరో భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ నికర విలువ 85.6 మిలియన్ డాలర్లు పెరిగి 90.2 బిలియన్ డాలర్లు పెరిగి 17వ స్థానంలో కొనసాగుతున్నారు.
మంగళవారం రోజున అదానీ స్టాక్ విపరీతంగా పెరుగుదలను చూడటంతో ఆయన స్థాయి ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ తిరిగి పుంజుకుంది. దీంతో లిస్టెడ్ స్టాక్స్ దాదాపు 20 శాతం పెరుగుదలను చూశాయి. ఈ క్రమంలో నిన్న అదానీ పవర్ 19.99 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 13.52 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 7 శాతం, అదానీ పోర్ట్స్ 5.25 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్ కూడా 12.23 శాతం మేర పెరిగి మంచి పనితీరును కనబరిచాయి. అదానీ కంపెనీ షేర్లపై ప్రజల్లో పెరుగుతున్న బలమైన నమ్మకమే ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications